ఏజన్సీ ని ముంచెత్తుతోన్న వరద నీరు..

తూర్పుగోదావరి:

- చింతూరు మండలంలో 30 వ నెంబర్ జాతీయ రహదారి పై భారీగా చేరిన వరద నీరు.

- ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు నిలిచిపోయిన రాకపోకలు..

- వరద పోటెత్తడం తో చింతూరు మండలం కుయుగురు, కల్లేరు, సోకిలేరు, చట్టి, ఒడ్డు, నర్సింహపురం, గ్రామాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు..

- కూనవరం, వి.ఆర్.పురం మండలాల్లో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న శబరి, గోదావరి నదులు..

- లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు.

- కూనవరం ని చుట్టుముట్టిన శబరి గోదావరి నదులు..

- జలదిగ్బంధంలో టేకులబోరు, కొండరాజుపేట, శబరికొత్తగూడెం, పోలిపాక, మురుమురు, దూగుట్ట గ్రామాలు.

- కూనవరం పోలీస్ గ్రౌండ్, ఉదయభాస్కర కాలనీ, గిన్నెల బజారుని ముంచెత్తిన వరద నీరు..

- అర్ధరాత్రి నుంచి సహాయక చర్యలు చేపట్టిన, పోలీస్, రెవెన్యూ యంత్రాంగం..

- 3వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న నదులు..

Update: 2020-08-16 01:34 GMT

Linked news