నూటికి నూరు శాతం అమరావతే రాష్ట్ర రాజధాని: ఎంపీ రఘురామకృష్ణంరాజు
నూటికి నూరు శాతం అమరావతే రాష్ట్ర రాజధాని అని ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేసారు
రాజీనామా విషయంలో నన్ను విసిగించవద్దని చెప్పినా వినిపించుకోవడం లేదు
నారాయణ స్వామి నా మీద చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నా. ఎంపి సీటుకోసం నేను ఎవరినీ ప్రాధేయపడలేదు. నారాయణ స్వామి సంయమనం పాటించాలి
రాష్ట్రంలో తెలుగు భాషకు గ్రహణం పట్టింది.
తెలుగుభాష ప్రేమికులు రాష్ట్రంలో తలదించుకోవాల్సిన రోజులు ఉన్నాయి.
ప్రముఖ తెలుగు పత్రికలో న్యాయమూర్తుల చేస్తున్నారని వార్త వచ్చింది.ఫోన్లు ట్యాప్ చేయడం వల్ల ప్రభుత్వం చిక్కులలో పడుతుంది. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తుంది. మా ఫోన్ లు కూడా ట్యాప్ చేస్తున్నారు.
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించకముందే రాష్ట్రప్రభుత్వమే విచారణకు ఆదేశించాలి.
సీఎం కు తెలిసి జరగకపోయినా , ఆయన అభిమానం సంపాదించడానికి కొంతమంది అధికారులు చేస్తున్నారు . సీఎం గారు మీకు తెలియకుండా మీ కోటరిలోని అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారు.
కోర్టులు శిక్షించకముందే ప్రభుత్వమే విచారణ జరిపి శిక్షించాలి. న్యాయ స్థానాల మీద నిఘా పెట్టకుండా , వారి ఇచ్చే తీర్పులు గౌరవించాలి.
రాజధాని అంశం కోర్టులో పెండింగు లో ఉండగా రాజధాని తరలింపు ప్రకటన , శంకుస్థాపన ప్రకటన చేయడం సరికాదు - రఘురామకృష్ణంరాజు, నర్సాపురం ఎంపి