ఈరోజు అయోధ్యలో ప్రధాని పర్యటన ఇలా..
- అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం కొద్ది గంటల్లో భూమిపూజ జరుగనుంది.
- ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
- ప్రధాని ఈరోజు ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక జెట్‌లో ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరతారు.
- 10.40కి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 11.30కి అయోధ్యకు చేరుకుంటారు.
- 11:40కి హనుమాన్‌గర్హి ఆలయంలో పూజలు చేస్తారు.
- 10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ప్రధాని సందర్శన సందర్భంగా ప్రధాన పురోహితుడు మహంతి రాజుదాస్ సహా పలువురు అర్చకులు దేశంలో కరోనా తొలగిపోవాలంటూ వేదమంత్రాలు చదువనున్నారు.
- మధ్యాహ్నం 12 గంటలకు రామజన్మభూమి ప్రాంతానికి ప్రధాని చేరుకోనున్నారు.
- మధ్యాహ్నం 12:30 నుంచి 12:40 వరకు భూమి పూజ జరుగనుంది.
- మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది.
- 2:15 గంటలకు ప్రధాని తిరిగి ఢిల్లీకి వెళ్తారు.
- కాగా, భూమిపూజకు ఆహ్వానం అందినవారే అయోధ్యకు రావాలని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ విజ్ఞప్తి చేశారు.
- మొత్తం 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం పంపినట్లు ఆయన తెలిపారు.
- భూమిపూజ కార్యక్రమంలో రెండు వేల ప్రాంతాల నుంచి సేకరించిన పవిత్రమైన మట్టి, 100 నదుల నుంచి తెచ్చిన నీరును వినియోగించనున్నారు.