పొన్నాల లక్ష్మయ్య మాజీ మంత్రి

- ఏపీ సీఎం కృష్ణ నీళ్లను రాయలసీమకు తరలిస్తామని అంటే.. తెలంగాణ సీఎం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

- మేము గట్టిగా మాట్లాడితే అపెక్స్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తామన్నారు.

- తీర అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెడితే వాయిదా వేయమన్నాడు.

- కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడు.

- క్షమించరాని చారిత్రక తప్పిదాలు చేస్తున్నాడు కేసీఆర్.

- జగన్ కెసిఆర్ కలిసే పనిచేస్తున్నారనే అనుమానాలున్నాయి.

- ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదిపై మేము ప్రతిపాదించిన ప్రాజెక్టుల ను కేసీఆర్ సీఎం అయ్యాక పక్కన పెట్టారు.

- దుమ్ముగూడెం, కంతాల పల్లి ప్రాజెక్టు లను పక్కన పెట్టాడు.

- రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఆనాడు మేము

- అఖిల పక్ష నేతలను తీసుకెళ్లి బాబ్లీపై కేంద్రానికి ఫిర్యాదు చేశాము.

- కానీ కెసిఆర్ ఎవరితోనూ సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు.

- 10 లక్షల ఎకరాలకు నీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలి.

- పక్క రాష్ట్ర ఆగడాలను అరికట్టాలి.

- కెసిఆర్ కు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా తన వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమా..

Update: 2020-08-04 12:13 GMT

Linked news