మచిలీపట్నంలో మరోమారు లాక్డౌన్ కి మొగ్గు చూపిన మంత్రి పేర్నినాని...
మచిలీపట్నం : ఆగస్టు 3 నుండి 9 వరకు మచిలీపట్నం మరియు గ్రామీణ ప్రాంతాల్లో లాక్డౌన్ నిర్వహణకు మంత్రి పేర్ని ఆదేశాలు. నేటి టాస్క్ఫోర్స్ సమావేశంలో మంత్రి కీలక నిర్ణయం..ప్రజా శ్రేయస్సే ముఖ్యమన్న మంత్రి. నిత్యావసర సరుకుల కోసం ఉదయం 6 నుండి 9గంటల వరకు వేసులు బాటు. వ్యాపారాలు తప్పనిసరిగా హ్యాండ్ గ్లౌస్ ధరించి,మాస్క్ తో వ్యాపార కార్యక్రమాలు నిర్వహించాలి. పనికి,వ్యాపారానికి,ముచ్చట్లకి పక్క ఊర్లకి పోవడం..లేదు బందరులోకి రావడం జరగకూడదని అధికారులకు ఆదేశాలు. వ్యవసాయ రైతులకు,కూలీలకు వెసులుబాటు..తప్పని సరిగా మాస్క్ ఉండాలి. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం, బక్రీద్ అంటూ పండుగల పేరుతో వైరస్ని ఆహ్వానించకండి. మన శ్రేయస్సు, మన ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసమే ఈ కఠిన నిర్ణయం. లాక్డౌన్ నియమావళి అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ.
Update: 2020-07-29 10:48 GMT