అక్రమంగా తరలిస్తున్న గంజాయి లారీని పట్టుకున్న చిలకలూరిపేట అర్బన్ పోలీసులు

చిలకలూరిపేట : 16 వ నెంబరు జాతీయ రహదారిపై చిలకలూరి పేట వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న లారీని చిలకలూరిపేట అర్బన్ పోలీసులు ఆదివారం అడ్డుకొని స్వాధీనం చేసుకున్నారు. టి ఎన్ 70 జె 4491 నంబరు గల వాహనం విశాఖపట్నం నుంచి చెన్నై వెళుతోంది.

చిలకలూరిపేట పట్టణం లోని ఎన్ ఆర్ టి సెంటర్లో ఈ వాహనంపై అనుమానం వచ్చిన పోలీసులు దానిని అడ్డగించి స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆ లారీని పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్దకు తీసుకువెళ్లారు.

గుట్టుచప్పుడు కాకుండా మొక్కజొన్న రవాణా పేరుతో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొక్కజొన్న బస్తాల మధ్యలో 280 కేజీల గంజాయి, 2 కిలోల ప్యాకేట్స్ తో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీని విలువ మార్కెట్లో సుమారు 20 లక్షల పైన ఉంటుందని అన్నారు.

డ్రైవర్, క్లీనర్ని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నామని, ఇంకా సమాచారం రావాల్సి ఉందని అర్బన్ సీఐ టి.వెంకటేశ్వర్లు అన్నారు.



Update: 2020-07-26 14:15 GMT

Linked news