ఇంటర్ మార్పులపై అభిప్రాయ సేకరణ
కరోనా వైరస్ విలయంలో అన్ని చోట్లా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పాటు విద్యా విధానంలో సైతం మార్పులు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రధానంగా ఏపీలో ఇంటర్ విద్యలో గత మాదిరి కాకుండా యూనిట్ టెస్ట్ లు నిర్వహించి, ఎప్పటికప్పుడు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంటర్ విద్యా విధానంలో సమూల మార్పులకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ఇకపై ఇంటర్మీడియట్‌లో యూనిట్ పరీక్షల విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. విద్యార్థుల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడంతోపాటు వారిని పోటీ పరీక్షలకు రెడీ చేసేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు.
సబ్జెక్టుకు ఒక వర్క్‌బుక్‌ను ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు అనుగుణంగా మల్టిపుల్ ఛాయిస్ క్వచ్చన్స్, ఖాళీలు నింపడం లాంటి ప్రశ్నలతో వీటిని రూపొందిస్తున్నారు.
Update: 2020-07-25 04:26 GMT