ధరల పెంపుపై ప్రైవేటు విద్యుత్ సంస్థలకు షాక్..
ధరల పెంపుపై ప్రైవేటు విద్యుత్ సంస్థలు కమీషన్ కు చేసిన ప్రతిపాదనలను తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వీలుకాదని వెల్లడించింది. పలు డిమాండ్లతో కమీషన్ ను ఆశ్రయించిన ప్రైవేటు సంస్థలకు చుక్కెదురైంది. ప్రజా ధనాన్ని పరిరక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) మరో కీలక తీర్పు వెలువరించింది. పెరిగిన గ్యాస్ ధరల ఆధారంగా రెండేళ్ల కాలానికి అదనపు చర వ్యయం (వేరియబుల్ కాస్ట్) ఇవ్వాలంటూ ప్రైవేట్ విద్యుత్ సంస్థలు ల్యాంకో, స్పెక్ట్రం, శ్రీవత్సవ వేసిన పిటిషన్‌ను కమిషన్ తోసిపుచ్చింది.
Update: 2020-07-25 03:31 GMT