కోవిద్ పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: పవన్ కళ్యాణ్
కరోనా మహమ్మారి ప్రజలనే కాదు... అధికారులను సైతం బలి తీసుకుంటోంది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కబళించివేస్తోంది. ఈ మధ్యకాలంలో జరిగిన ఇలాంటి ఘటనలపై జనసేన అధినేత వపన్ కల్యాణ్ స్పందించారు. వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ కట్టడికి ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నవారిలో కొందరు ఆ మహమ్మారి కాటుకు బలైపోతుండడం చాలా బాధ అనిపిస్తోంది. వైద్యం, పారిశుద్ధ్య, పోలీస్ శాఖలకు చెందిన వారు మృతి చెందడం మనసు కలచివేసే విషాదం.
నిన్న మొన్న తిరుపతి, అనంతపురం నగరాలలో సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా పని చేస్తున్న ఇద్దరు అధికారులు కోవిడ్ బారినపడి మరణించడం దురదృష్టకరం. అలాగే గుంటూరు జిల్లాలో సీనియర్ వైద్యాధికారితోపాటు, రాష్ట్రంలో ముగ్గురు యువ వైద్య విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడి కన్నుమూయడం దిగ్భ్రాంతికరం.
Update: 2020-07-17 04:58 GMT