గుత్తి జంక్షన్ వద్ద అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్
- గుత్తి జంక్షన్ వద్ద అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే....
- గుంతకల్లు డివిజన్ మరియు ఆర్ఎస్ఎల్ సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రధాన జంక్షన్లో 4 వైపులా - ముంబై , చెన్నై , బెంగళూరు, సికింద్రాబాద్ లకు రైళ్ళ నిర్వహణ సులభతరం...
- గుత్తి ప్రధాన యార్డ్ పునర్నిర్మాణ పనులతో పాటు అతిపెద్ద ఎలక్రానిక్ ఇంటర్ లాకింగ్ ( ఇఐ ) వ్యవస్థను జూలై 12 , 2020 న ( నిర్దేశిత లక్ష్యంలోపునే ) దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది...
- ఈ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సిగ్నలింగ్ వ్యవస్థ అత్యంత ఆధునికమైన సిగ్నలింగ్ వ్యవస్థ...
- గుత్తి స్టేషన్ యార్డు వద్ద ఏర్పాటైన ఇంటర్ లాకింగ్ వ్యవస్థ దక్షిణ మధ్య రైల్వేలో 4 వ అతిపెద్ద ఇంటరాకింగ్ వ్యవస్థ....
- మిగిలిన మూడు సికింద్రాబాద్ , విజయవాడ , కాజిపేట స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది.ఈ మూడు యార్లు ఎలక్ట్రానిక్ ఇంటరాకింగ్ వ్యవస్థలు కావు...
- ఇప్పుడు గుత్తి స్టేషన్ వద్ద ఆధునీకరించిన మరియు పటిష్టం చేసిన సిగ్నలింగ్ వ్యవస్థ దక్షిణ మధ్య రైల్వేలో 343 రూట్లతో అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ స్టేషన్ అవుతుంది.
- గతంలో గుత్తి స్టేషన్ వద్ద సిగ్నల్ ఆపరేషన్ నియంత్రణ రెండు చివరల ఉండే క్యాబిన్లు మరియు ఒక సెంట్రల్ డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ ద్వారా జరిగేది...
- ప్రస్తుతం దీని స్థానంలో ఎలక్రానిక్ ఇంటర్ లాకింగ్ సింగిల్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒకే ఆపరేటర్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది....
- గుత్తి స్టేషన్ యార్డు వద్ద కేవలం 4 లైన్ల సౌకర్యంతో రైళ్ళ రాకపోకలు నేరుగా జరిగేవి . ఆధునికీకరణ పూర్తి కావడంతో ప్రస్తుతం రైళ్ల నిర్వహణ 11 లైన్ల స్థాయికి పెరిగింది..
- గుంతకల్లు డివిజన్లో గుత్తి స్టేషన్ ఒక ప్రధాన రైల్వే జంక్షన్‌గా - ముంబై , చెన్నై , బెంగళూరు మరియు సికింద్రాబాద్ / హైదరాబాద్ లవైపు రైళ్ళను నిర్వహించడం జరుగుతున్నది.