కాపు సోదర, సోదరమణులకు లేఖ రాసిన మాజీమంత్రి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం
తూర్పుగోదావరి -రాజమండ్రి.. కాపు సోదర, సోదరమణులకు లేఖ రాసిన మాజీమంత్రి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం
- కొందరు పెద్దలు నన్ను తిట్టించే పరిణామాలకు కలత చెంది ఉద్యమం నుంచి ప్రక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను..
- ఈమధ్య పెద్దవారు చాలా మంది మన సోదరుల చేత మానసికంగా కృంగిపోయేలా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నాపై దాడులు చేయిస్తున్నారు..
- ఈవిధంగా దాడులు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో నాకైతే అర్ధం కావడం లేదు..
- నేను ఉద్యమం లోకి రావడానికి ముఖ్యకారణం చంద్రబాబే..
- మన జాతికి బిసీ రిజర్వేషన్లు ఇస్తానని హామీ కోసమే ఉద్యమం చేపట్టాం
- దీని ద్వారా పదవులుకానీ, డబ్బుకానీ పొందాలని ఎనాడు అనుకోలేధదు
- ఉద్యమంలోకి వచ్చాక ఆర్ధికంగా, రాజకీయంగా ,
- ఆరోగ్యపరంగా చాలా నష్టపోయాను..
- రాజకీయంగా ఎంత నష్టపోయానో మీ అందరికీ తెలుసు, అయితే ఏరోజు దానికోసం చింతించలేదు
- తుని సభ,పాదయాత్ర ఘనంగా జరగడానికి నా గొప్పకాదు . మన జాతి ఆకలి అన్న అంశం గమనించాలి
- నా రాజకీయ జీవితంలో అనేక పార్టీలు,కుల సభలు చూశాను..
- తుని సభకు రెండురోజుల ముందే జనం చేరుకోవడం ఆనందాన్నిచ్చింది
- రిజర్వేషన్లు ఇచ్చేస్తే ఆ పేరు నాకే వచ్చేస్తుందని ఆశించేవాడ్ని కాదు..
- రిజర్వేషన్లు ఇచ్చేస్తే నేను గొప్పవాడ్ని అయిపోతానని అభిప్రాయాలు పడ్డారు.
- జేఏసీ, అడ్వకేట్స్, మేధావుల సూచనలమేరకే ఉద్యమాన్ని నడిపాను
- ఉద్యమం లో మెరుగైన ఫలితాలు కోసం రకరకాల ఆలోచనలతో ముందుకు వెళతాం
- ఒకే ఆలోచన తో ఏ ఉద్యమం ముందుకు సాగదు
- ఏదో రూపంలో జాతికి మంచి జరగాలన్నదానిపై ఎన్నో ప్రయత్నాలు , ఉద్యమాలు చేశాం
- అవన్నీ కూడా తప్పు అనడం న్యాయం గా లేదు..
- కులద్రోహి, గజదొంగలా మాట్లాడారట
- తప్పదు పోస్టింగులు పెడుతున్నారు
- ఇవన్నీ చూసి కలత చెంది ఉద్యమం నుంచి ప్రక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను..
- ఉద్యమం ద్వారా నేనేమి సాధించలేదని, రోజూ పేరు చెప్పకుండా పదిమందితో తిట్టిస్తున్నారు.
- డ్రైవరు సీటులో వారే కూర్చుని జాతికి నేను తీసుకురాలేని రిజర్వేషన్లు వచ్చేలా చేయమని, మడుగులో కూర్చుని ఇతరులచేత నన్ను తిట్టించే వారిని కోరుతున్నాను