సెక్రటేరియట్‌లోని మసీదులు, ఆలయాన్ని కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ
- టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని ఉల్లంఘించడం మరియు బహిరంగంగా ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు
- గతంలో మేము ఈ సమస్యను లేవనెత్తినప్పుడు, కొంతమంది మంత్రులు రెండు మసీదులు మరియు ఒక ఆలయం ప్రస్తుత నిర్మాణాలను కూల్చకుండా సచివాలయం నిర్మించుకుంటాం అని హామీ ఇచ్చారు.
- చారిత్రాత్మక ప్రాంగణంలో ఉన్న రెండు చారిత్రాత్మక మసీదులు మరియు ఆలయాన్ని రక్షించమని కోరుతూ 2019 జూన్ 27 న ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశాను.
- మేము ఆధునిక సెక్రటేరియట్ కలిగి ఉండటానికి వ్యతిరేకం కాదునిసిఎం కెసిఆర్‌కు చాలాసార్లు స్పష్టంగా చెప్పాము,
- ప్రస్తుత కరోనా సమయంలో నిర్మాణ చేయటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము.
- మసీదులను కూల్చివేయలేదని కొందరు టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు సరికాదు.
- సెక్రటేరియట్ ప్రాంగణంలో మసీదులు మరియు దేవాలయాల ప్రస్తుత స్థితిని చూపించే వీడియో ఫుటేజీని జిహెచ్ఎంసి కమిషనర్ విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు
- సిఎం కెసిఆర్ వారి ప్రార్థనా స్థలాలను కూల్చివేసి అన్ని వర్గాల మత మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు.
- టిఆర్ఎస్ ప్రభుత్వం ఆరాధన స్థలాల నిబంధనలను కూడా ఉల్లంఘించింది.
- సిఎం కెసిఆర్‌కు చట్టం లేదా రాజ్యాంగం పట్ల గౌరవం లేదు మరియు కెసిఆర్ చాలా సందర్భాల్లో కేంద్ర చట్టాలను బహిరంగంగా ఉల్లంఘించాడు.
- సుప్రీంకోర్టు మరో స్టేను ఎక్కడ ఇస్తుందో అని మాత్రమే అతను సచివాలయాన్ని కూల్చివేసాడు
- కెసిఆర్ యొక్క మూఢ నమ్మకాలు తప్ప, మరే ఇతర మతం లేదా ప్రార్థనా స్థలాలకు టిఆర్ఎస్ పాలనలో తగిన ప్రాముఖ్యత ఇవ్వడం లేదు