జనసేనాని చతుర్మాస దీక్ష!
- ప్రజా సమస్యలపై నిత్యం స్పందించే గుణమున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చతుర్మాస దీక్ష చేపట్టనున్నారు. కరోనాతో నాలుగు నెలలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని కోరుతూ ఈ దీక్షను చేపడుతున్నారు.
- జనసేనాని పవన్‌కల్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టారు. ప్రస్తుతం దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రభావం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అందరూ బావుండాలని, తిరిగి అందరూ సాధారణ జీవితాన్ని కొనసాగించాలని పవన్ ఈ దీక్షను చేపట్టారు. నాలుగు నెలల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది. దీక్షలో భాగంగా పవన్ ఓ పూట మాత్రమే భోజనం చేస్తారు.
- ఇక సినిమాల విషయానికి వస్తే కరోనా ప్రభావం తగ్గిన తర్వాత పవన్ కల్యాణ్ తాను నటిస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమాతో పాటు క్రిష్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు.