రెండు వేల పడకల సామర్ధ్యంతో కోవిడ్ కేర్ సెంటర్: కలెక్టర్

› అమలాపురం: అల్లవరం మండలం బోడసకుర్రులోని ఆంధ్రప్రదేశ్ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ( టిడ్ కో) భవన సముదాయంలో సుమారు 15 వందల నుండి 2 వేలు పడకల సామర్ధ్యంతో కోవిడ్ కేర్ సెంటర్, ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి తెలిపారు.

›› బుధవారం కలెక్టర్ బోడసకుర్రులోని టిడ్ కో భవన సముదాయాన్ని సందర్శించి కోవిడ్ కేర్ సెంటర్ మరియు క్వారం టైన్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో కలెక్టర్ మాట్లాడుతూ... విస్తీర్ణం పరంగానూ, జనాభా పరంగానూ కూడా జిల్లా పెద్దది కావడం వలన కోవిడ్ నియంత్రణకు అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.

›› జిల్లాలో 15 కోవిడ్ ఆసుపత్రులు వున్నాయని 3 వేల పడకల సామర్ధ్యంతో బొమ్మూరులో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగిందని, అమలాపురం డివిజన్ కు సంభందించిన కరోనా పాజిటివ్ కేసులకు ఈ టిడ్ కో భవన సముదాయంలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని, అయితే స్థానికులు లేనిపోని వివిధ రకాల అపోహలతో అభ్యంతరం చెబుతున్నారని కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను దూరం పెట్టడం కాకుండా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తీసుకోవాలని ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి అనేక పర్యాయాలు చెప్పడం జరిగిందని కలెక్టర్ తెలియచేశారు. 



Update: 2020-07-01 13:34 GMT

Linked news