ఏపీలో ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సీరియస్ వార్నింగ్
- ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ ప్రభావం తగ్గగానే స్కూల్స్ తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
- అదే సమయంలో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు కూడా విద్యార్ధులపై దృష్టిసారించాయి.
- ఈ ఏడాది కూడా తమ టీచర్లను విద్యార్దుల ఇళ్లకు పంపి అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.
- అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
- కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో అడ్మిషన్ల కోసం టీచర్లను విద్యార్ధుల ఇళ్లకు పంపడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
Update: 2020-06-25 03:27 GMT