కరోనా టెస్టులకు ఐ మాస్క్ బస్సులు రెడీ..!

- సామాజిక వ్యాప్తి ద్వారా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంటింటా కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

- వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ -19 ఐ మాస్క్ ట్రేడ్ మార్క్ తో అత్యాధునిక సాంకేతిక వైద్య పరిజ్ఞానం కలిగిన కోవిడ్ టెస్టు కిట్లు , వైద్య పరికరాలతో కూడిన మొబైల్ బస్సులను రెడీ చేశారు.

- రాష్ట్రంలో కరోనా మహమ్మారివిజృంభణ నేపథ్యంలో వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య శాఖాధికారులను ఆదేశించి బడ్జెట్ ను కేటాయిస్తు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేశారు.

- వలస జీవుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైరస్ వ్యాప్తి చెందిన నేపథ్యంలో కట్టడి కోసం లాక్ డౌన్ విధించారు.

- వైద్య శాఖ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ మోనటరింగ్ ఎనలైసిస్ సర్వీస్ క్వారంటైన్ పేరుతో కోవిడ్ -19 ఐ మాస్క్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. పల్లెల్లో సైతం కరోనా వైరస్ సామాజికంగా వ్యాప్తి చెందటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

- పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలందరికి కోవిడ్ పరిక్షలు చేసేందుకు కోవిడ్ ఐ మాస్క్ మొబైల్ బస్సులు పట్టణాలతో పాటు పల్లెల్లో సంచరించి‌ వైద్య సేవలందించనున్నాయి.




Update: 2020-06-24 03:12 GMT

Linked news