పెట్రోల్ బంకుల్లో కరోనా కట్టడికి స్మార్ట్ డ్రైవ్ యాప్
- కరోనా బారిన పడకుండా ఉండాలి.. ఆ దిశగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నగదు లావాదేవీలు లేదా కార్డులతో చెల్లింపులు చేసినటపుడు వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయాందోళన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది.
- ముఖ్యంగా నేడు మానవ జీవితంలో భాగమైన పెట్రోల్, డీజిల్ బంకులలో ఈ ఆందోళన మరింత ఎక్కువగా ఉంటోంది.
- పెట్రోల్ బంకులకు నిత్యం వేలాది మంది వస్తూ వెళ్తూ ఉంటారు. ఇంధనం పోయించుకున్న తర్వాత నగదు లేదా కార్డు రూపంలో చెల్లింపులు చేస్తుంటారు.
- తద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
-పెట్రోల్ బంకులను సురక్షితంగా మార్చే దిశగా భారత్ పెట్రోలియం సంస్థ 'స్మార్ట్ డ్రైవ్' అనే యాప్ను రూపొందించింది.
- దీని ద్వారా పెట్రోల్ బంకుల్లో వినియోగదారుడు టచ్ లెస్ ట్రాన్సాక్షన్స్ చేసే వీలు కలుగుతోంది.
- తద్వారా వైరస్ సామాజిక వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని భారత్ పెట్రోలియం సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
- ప్రయోగాత్మకంగా దేశంలో ఎంపిక చేసిన ఐదు నగరాల్లో ఈ యాప్ను ప్రవేశపెట్టారు.
- విశాఖ షీలా నగర్ వద్ద ఉండే భారత్ పెట్రోలియం బంక్లో యాప్ను లాంచ్ చేశారు.
- ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలను, టచ్ లెస్ విధానంలో చెల్లింపులు చేయాలని నిర్వాహకులు సూచించారు.