నేటి నుంచి తెలంగాణాలో పీజీ మెడికల్, డెంటల్ పరీక్షలు
- నేటి నుంచి తెలంగాణాలో పీజీ మెడికల్, డెంటల్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
- వీటిని వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించడంతో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
- అయితే కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని నిర్వహిస్తున్నారు.
- ఈ నెల 20, 22, 24 తేదీలలో పీజీ డిప్లొమా పరీక్షలు.
- జూన్ 20, 22, 24, 26 తేదీల్లో పీజీ డిగ్రీ పరీక్షలు జరగనున్నాయి.
- ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
- ఉదయం 8.30కి స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలి.
- మొత్తం 13 సెంటర్లు ఉండగా.. గాంధీ మెడికల్ కాలేజీ సెంటర్‌ను కామినేని అకాడమీ - ఆఫ్ మెడికల్ సైన్సెస్ , ఎల్బీ నగర్, సికింద్రాబాద్‌కు తరలించారు.
- 994 మంది పీజీ డిగ్రీ పరీక్షలు, 193 మంది పీజీ డిప్లొమా పరీక్షలు రాయనున్నారు.
Update: 2020-06-20 02:42 GMT