ఈరోజు వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం రెండో ఏడాది ఆర్ధిక సాయం విడుదల
- కరోనా, లాక్‌డౌన్ నేపధ్యంలో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న నేతన్నల కుటుంబాలను ఆదుకునేందుకు 6 నెలలు ముందుగానే ఆర్ధిక సాయం
- క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైయస్.జగన్
- సొంత మగ్గమున్న నేతన్నల కుటుంబాలకు ఏడాదికి రూ.24వేలు చొప్పున ఆర్ధిక సాయం.
- మొత్తం 81,024 మంది లబ్ధిదార్లకు రూ.194.46 కోట్ల అర్ధిక సాయం అందజేయనున్న ప్రభుత్వం
- చేనేత సహకార సంఘాలకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.103 కోట్లు చెల్లించేందుకు ఆప్కోకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
- కరోనా వైరస్ నివారణకై మాస్కుల తయారీకై ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాల నుంచి సేకరించిన వస్త్రాలకు రూ.109 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.
Update: 2020-06-20 02:41 GMT