Cyber Crime Complaint: ఆన్‌లైన్‌ మోసాలపై ఎక్కడ ఫిర్యాదు చేయాలి.. హెల్ప్‌లైన్ ఇతర విషయాలు తెలుసుకోండి..

Cyber Crime Complaint: నేటి రోజుల్లో టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ఆన్‌లైన్‌ మోసాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే వినియోగదారులు వీటిపై అవగాహన కలిగి ఉండాలి.

Update: 2023-07-21 13:30 GMT

Cyber Crime Complaint: ఆన్‌లైన్‌ మోసాలపై ఎక్కడ ఫిర్యాదు చేయాలి.. హెల్ప్‌లైన్ ఇతర విషయాలు తెలుసుకోండి..

Cyber Crime Complaint: నేటి రోజుల్లో టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ఆన్‌లైన్‌ మోసాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే వినియోగదారులు వీటిపై అవగాహన కలిగి ఉండాలి. అవకాశం దొరికితే సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు సైబర్‌ క్రైమ్‌కి బలి అవుతున్నారు. ఒకవేళ మీకు తెలియకుండానే మీరు ఆన్‌లైన్‌ మోసానికి గురైతే ఏం చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు. అలాంటి సమయంలో ఈ విధంగా స్పందించండి. ఆన్‌లైన్ పోర్టల్ వాస్తవానికి సైబర్ క్రైమ్‌ను ఎదుర్కోవడానికి బాధితులకు సహాయం చేయడానికి ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను అందించింది. 

 ఇందుకోసం ముందుగా ఆన్‌లైన్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.inకి వెళ్లాలి. ఇందులో సైబర్ క్రైమ్‌కు సంబంధించిన కంప్లెయింట్ చేయవచ్చు. హ్యాకింగ్ కేసులు, ఆన్‌లైన్ మోసాలు, సైబర్ బెదిరింపు వంటి అనేక సైబర్ క్రైమ్ కేసులను ఫిర్యాదు చేయవచ్చు. ఏ పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలి..? ఆన్‌లైన్‌ మోసానికి గురైతే ముందుగా సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి కంప్లెయింట్‌ చేయాలి. తర్వాత పోలీసులు మీ ప్రాంతంలోని సైబర్ క్రైమ్ ఇన్వెస్టింగ్ యూనిట్లకు సమాచారాన్ని చేరవేస్తారు. తర్వాత వారు ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెడుతారు. సైబర్‌ క్రైమ్‌కి గురైతే ఖచ్చితంగా ఆన్‌లైన్ ఫిర్యాదుతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లెయంట్‌ చేయాలని గుర్తుంచుకోండి. హెల్ప్‌లైన్ నంబర్ హెల్ప్‌లైన్ నంబర్ గురించి మాట్లాడుతూ 1930 అనేది టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్. ఇది సైబర్ క్రైమ్ కేసులపై ఫిర్యాదు చేయడానికి సహాయం చేస్తుంది. ఈ నెంబర్‌ 24×7 అందుబాటులో ఉంటుందని మరిచిపోవద్దు.

Tags:    

Similar News