Today Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. రూ.84వేలు దాటిన తులం బంగారం ధర

Update: 2025-01-31 00:18 GMT
Today Gold Rates:  పసిడి ప్రియులకు బిగ్ షాక్.. రూ.84వేలు దాటిన తులం బంగారం ధర
  • whatsapp icon

Today Gold Rates: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర మొదటిసారిగా రూ. 84వేలు దాటింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర రూ. 84,500 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర రూ. 95,400 వద్ద ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో మార్పు చేయని నేపథ్యంలోనూ అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర గురువారము 40 డాలర్లకు పైగా పెరిగింది. 2,793 డాలర్లకు చేరుకుంది. దేశీయంగా డాలర్ విలువ రూ. 86,62 కావడంతో మన దేశంలో బంగారం ధరలు మరింత భగ్గుమంటున్నాయి. కిలో వెండి ధర కూడా అంతర్జాతీయ మార్కెట్లో 26 డాలర్లకు పైగా పెరిగింది. 1,014డాలర్లకు చేరుకుంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమువుతుందనే భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆర్థిక భరోసా కోసం పెట్టుబడులను బంగారంపైకి మళ్లిస్తున్నారు.

డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ క్షీణతను అడ్డుకునేందుకు అత్యవసరం కాని ఉత్పత్తులు లోహాలపై దిగుమతి సుంకాన్ని వచ్చే బడ్జెట్లో పెంచుతారనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో ఉంది. అందుకే ధర మరింత పెరుగుతుందనే అంచనాతో కొనుగోలు చేసి ఉంచుతున్నారని చెబుతున్నారు. 

Tags:    

Similar News