Credit Cards Payments: క్రెడిట్‌ కార్డ్స్ ద్వారా ఇలాంటి చెల్లింపులకు స్వస్తి.. ఆర్బీఐ నిబంధనలు తెలుసుకోండి..!

Credit Cards Payments: నేటి రోజుల్లో క్రెడిట్‌ కార్డ్స్‌ వినియోగం విపరీతంగా పెరిగింది.

Update: 2024-04-26 03:30 GMT

Credit Cards Payments: క్రెడిట్‌ కార్డ్స్ ద్వారా ఇలాంటి చెల్లింపులకు స్వస్తి.. ఆర్బీఐ నిబంధనలు తెలుసుకోండి..!

Credit Cards Payments: నేటి రోజుల్లో క్రెడిట్‌ కార్డ్స్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. యువత ఎక్కువగా వాడుతున్నారు. దాదాపు ముఖ్యమైన చెల్లింపులన్నీ వీటితోనే చేస్తున్నారు. అయితే క్రెడిట్‌ కార్డ్‌ పర్పస్‌ వేరు. దీనిని కేవలం బిజినెస్‌ చెల్లింపుల కోసం మాత్రమే జారీ చేస్తారు. కానీ అందరూ వీటిని పర్సనల్‌ అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో ఆర్బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌తో కొన్ని చెల్లింపులు చేయకుండా నిబంధనలు మార్చబోతుంది. ఇలాంటి చెల్లింపుల గురించి తెలుసుకుందాం.

క్రెడిట్‌ కార్డ్స్‌తో ఇల్లు, దుకాణం అద్దె, సొసైటీ ఫీజు, ట్యూషన్ ఫీజు మొదలైన చెల్లింపులు చేయకుండా ఆర్బీఐ నిబంధనలు మార్చుతోంది. కస్టమర్ బిజినెస్‌ మ్యాన్‌ కాకుండా ఇతర లావాదేవీలు ఉంటే డబ్బును స్వీకరించే వ్యక్తి బిజినెస్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేయాలని చెబుతోంది. రెండింటి నియమాలలో తేడా ఉంటుంది. కొన్నేళ్లుగా ఈ రకాల చెల్లింపులకు క్రెడిట్‌ కార్డ్స్‌ ఎక్కువగా వాడుతున్నట్లు వారి సర్వేలో తేలింది. ఒక్క ఫిబ్రవరిలోనే క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1.5 లక్షల కోట్లు చెల్లించినట్లు లెక్కలు వెల్లడిస్తోంది. .

క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లించే అవకాశాన్ని అందించే అనేక ఫిన్‌టెక్ కంపెనీలు వచ్చాయి. దీని కోసం క్రెడిట్ కార్డ్ హోల్డర్ ప్రత్యేక ఖాతా ఓపెన్‌ చేస్తారు. మొత్తం అమౌంట్‌ కార్డుకు యాడ్‌ అవుతుంది. ఆపై ఇంటి యజమాని బ్యాంక్ ఖాతాకు పంపుతారు. ఇందుకోసం కంపెనీలు మూడు శాతం వడ్డీ వసూలు చేస్తాయి. ఇది క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఉదాహరణకు నగదు లేనప్పటికీ చెల్లింపుపై 50 రోజుల అవకాశం ఉంటుంది. చాలా క్రెడిట్ కార్డ్ కంపెనీలు క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్‌లను అందిస్తాయి. కొన్ని కంపెనీలు ఖర్చు పరిమితి ప్రకారం వార్షిక రుసుమును మాఫీ చేస్తాయి. బ్యాంకులు ఇప్పుడు ఇలాంటి చెల్లింపుల‌ను ఆపేందుకు ప్రయ‌త్నాలు ప్రారంభించాయి.

Tags:    

Similar News