SBI Credit Card Offers: అక్షయ తృతియకు బంగారం కొంటున్నారా? ఐతే ఇది మీ కోసమే

Update: 2025-04-28 13:50 GMT
SBI Credit Card Offers: అక్షయ తృతియకు బంగారం కొంటున్నారా? ఐతే ఇది మీ కోసమే
  • whatsapp icon

SBI Credit Card Offers on Gold purchases: అక్షయ తృతియ అంటేనే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది బంగారం కొనుగోలు చేయడమే. ఎందుకంటే మిగతా పండగలతో పోల్చుకుంటే ఇది పూర్తి భిన్నమైన ఉత్సవం. అక్షయ తృతియ రోజున బంగారం కొంటే బాగా కలిసొస్తుందనేది చాలామంది నమ్మకం. అందుకే ఆరోజు గోల్డ్ జువెలరీ షోరూమ్స్ కస్టమర్స్ తో సందడిగా ఉంటాయి. ఆ కస్టమర్స్ ను తమ దుకాణంలోకి ఆకర్షించేందుకు ఇప్పటికే జువెలరీ షోరూమ్స్ ఎన్నో ఆఫర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే అక్షయ తృతియ రోజు జరిగే వ్యాపారంలో తమ వాటాను కోల్పోకుండా ఉండేందుకు ఎస్బీఐ కూడా క్రెడిట్ కార్డ్ కస్టమర్స్ కోసం డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ గుప్పిస్తోంది.

అక్షయ తృతియ సందర్భంగా బంగారం కొనే ఎస్బీఐ క్రెడిట్ కార్డు కస్టమర్స్ కనీసం రూ. 2,000 నుండి రూ. 5,000 వరకు లబ్ధి పొందేలా ఈ ఆఫర్స్ డిజైన్ చేశారు. తనిష్క, జాయ్ అలుక్కాస్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఒర్రా, టీబీజెడ్, రిలయన్స్ జువెల్స్ లాంటి గోల్డ్ జువెలరీ షోరూంలలో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఆ ఆఫర్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

తనిష్క్ గోల్డ్ జువెలర్స్

ఆఫర్స్ ఏంటంటే - ఇక్కడ కనీసం రూ. 80,000 కొనుగోలు చేసే వారికి తక్షణమే రూ. 4,000 డిస్కౌంట్ ఇస్తారు. ఒక్క క్రెడిట్ కార్డుపై ఒక్క లావాదేవీకి మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది.

ఆఫర్ కాలపరిమితి - ఏప్రిల్ 24 నుండి 30వ తేదీ వరకు ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

ఏయే కార్డులపై ఆఫర్స్ వర్తిస్తాయి- కార్పొరేట్, క్యాష్‌బ్యాక్, పేటీఎం ఎస్బీఐ క్రెడిట్ కార్డులు మినహాయించి అన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై ఈ ఆఫర్స్ వర్తిస్తాయి.

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్

ఆఫర్స్ ఏంటంటే - కనీసం రూ. 50,000 కొనుగోలుపై ఒక్కో కార్డుకు రూ. 2,500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నారు. స్టోర్స్, వెబ్‌సైట్, మొబైల్ యాప్... ఇలా ఎందులో బంగారం కొనుగోలు చేసినా ఆఫర్ వర్తిస్తుంది.

ఆఫర్ కాలపరిమితి - ఏప్రిల్ 24 నుండి ఏప్రిల్ 30 వరకు ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి.

ఏయే కార్డులపై ఆఫర్స్ వర్తిస్తాయి- కార్పొరేట్, క్యాష్‌బ్యాక్, పేటీఎం ఎస్బీఐ క్రెడిట్ కార్డులు మినహా అన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై ఈ ఆఫర్స్ వర్తిస్తాయి.

జాయ్ అలుక్కాస్

ఆఫర్స్ ఏంటంటే - కనీసం రూ. 50,000 బంగారం లేదా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి రూ. 2,500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నారు. ఒక్కో కార్డుపై గరిష్టంగా రూ.2500 ఆఫర్ వర్తిస్తుంది.

ఆఫర్ కాలపరిమితి - 24 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ వరకు ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి.

ఏయే కార్డులపై ఆఫర్స్ వర్తిస్తాయి- కార్పొరేట్, క్యాష్‌బ్యాక్, పేటీఎం ఎస్బీఐ క్రెడిట్ కార్డులు మినహా అన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై ఈ ఆఫర్స్ వర్తిస్తాయి.

త్రిభువన్ దాస్ ఝవేరి

ఆఫర్స్ ఏంటంటే - కనీసం రూ. 50,000 నుండి రూ. 99,999.99 వరకు విలువైన బంగారం లేదా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి రూ. 2,500 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. అలాగే రూ. 1,00,000 కుపైగా కొనుగోలు చేసే వారికి రూ. 5,000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తున్నారు.

ఆఫర్ కాలపరిమితి - 24 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ వరకు ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి.

ఏయే కార్డులపై ఆఫర్స్ వర్తిస్తాయి- కార్పొరేట్, క్యాష్‌బ్యాక్, పేటీఎం ఎస్బీఐ క్రెడిట్ కార్డులు మినహా అన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై ఈ ఆఫర్స్ వర్తిస్తాయి.

రిలయన్స్ జెవెల్స్

ఆఫర్స్ ఏంటంటే - కనీసం రూ. 25,000 విలువ చేసే బంగారం లేదా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి 5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. గరిష్టంగా రూ. 2,500 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తున్నారు.

ఆఫర్ కాలపరిమితి - 24 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ వరకు ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. స్టోర్స్, మొబైల్ యాప్, వెబ్‌సైట్ ఎందులో కొనుగోలు చేసిన వారికైనా ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఏయే కార్డులపై ఆఫర్స్ వర్తిస్తాయి- కార్పొరేట్, క్యాష్‌బ్యాక్, పేటీఎం ఎస్బీఐ క్రెడిట్ కార్డులు మినహా అన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై ఈ ఆఫర్స్ వర్తిస్తాయి.  

Tags:    

Similar News