ఆర్బీఐ సంచలన నిర్ణయం.. త్వరలో కరెన్సీ నోట్లపై అబ్దుల్‌ కలాం, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చిత్రాలు

RBI: కరెన్సీ నోట్లపై ఇక రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలు దర్శనమివ్వనున్నాయి.

Update: 2022-06-05 14:58 GMT

ఆర్బీఐ సంచలన నిర్ణయం.. త్వరలో కరెన్సీ నోట్లపై అబ్దుల్‌ కలాం, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చిత్రాలు

RBI: కరెన్సీ నోట్లపై ఇక రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలు దర్శనమివ్వనున్నాయి. ఈ మేరకు ఈ ఇద్దరు భారత్నరత్నల ముఖ చిత్రాలు కరెన్సీ నోట్లపై ముద్రించాలని RBI భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు భారత కరెన్సీ నోట్లపై కేవలం మహాత్మాగాంధీ చిత్రం మాత్రమే ముద్రించారు. అయితే తొలిసారి గాంధీ కాకుండా ఇతరుల చిత్రాలతో కరెన్సీ ముద్రించాలని RBI భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై 2017లోనే ప్రతిపాదనలు వచ్చినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

అయితే త్వరలోనే వీటిపై ఒక నిర్ణయానికి రావాలని RBI భావిస్తోంది. ఈ మేరకు కొత్త వాటర్‌మార్కులు ఉన్న నోట్లను IIT ఢిల్లీ ఎమెరిటస్ ప్రొఫెసర్ దిలీప్ టి.షాహనీకి పంపారని సమాచారం. ఆయనే గాంధీ, ఠాగూర్, కలాం చిత్రాలలో ఒకదాన్ని ఎంపిక చేస్తారని చెబుతున్నారు. ఆయన సెలెక్ట్ చేసిన నోటును ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతారు.

Tags:    

Similar News