బిగ్ అలర్ట్: ఫిబ్రవరి 1 నుంచి అలా చేస్తే యూపీఐ పేమెంట్స్ బంద్
స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం అరచేతిలోకి వచ్చింది.

బిగ్ అలర్ట్: ఫిబ్రవరి 1 నుంచి అలా చేస్తే యూపీఐ పేమెంట్స్ బంద్
స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం అరచేతిలోకి వచ్చింది. అంతేకాదు బ్యాంకులకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఫోన్ లో ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ వంటి యాప్ ల ద్వారా డబ్బుల లావాదేవీలు సులభంగా చేస్తున్నాం. అయితే ఫిబ్రవరి 1, 2025 నుంచి యూపీఐ లావాదేవీల విషయంలో కీలక మార్పులు రానున్నాయి. మీ యూపీఐ ఐడీలో కొన్ని రకాల అక్షరాలు ఉంటే మీ లావాదేవీలు జరగవు. అంటే ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ ల ద్వారా డబ్బులు పంపడం సాధ్యం కాదు.
యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ యూపీఐ అనేది డిజిటల్ పేమెంట్ సిస్టం. ఫోన్ నెంబర్ ఆధారంగా ఒకరి నుంచి మరొకరికి డబ్బులు పంపవచ్చు .ప్రతి బ్యాంకు వినియోగదారులకు ప్రత్యేకమైన యూపీఐ ఐడీ అందిస్తాయి. 2025 ఫిబ్రవరి నుంచి యూపీఐ లావాదేవీల్లో ప్రత్యేక అక్షరాలను అనుమతించబోమని నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఎన్ పీ సీ ఐ ఓ సర్క్యులర్ విడుదల చేసింది. అంటే కేవలం నెంబర్లు లేదా అక్షరాలు కలిగిన లావాదేవీలను అనుమతిస్తామని తెలిపింది. యూపీఐ ఐడీలలో ఉదాహరణకు ఎట్ ది రేట్,హ్యష్ ట్యాగ్, డాలర్ తదితర ప్రత్యేక అక్షరాలు ఉన్న లావాదేవీలు అనుమతించరు. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఎన్ పీ సీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 2024 డిసెంబర్ లో 16.73 బిలియన్ల లావాదేవీలు జరగడం రికార్డు.