National Pension Scheme: ఈ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు రూ.1 లక్ష పెన్షన్ తీసుకోవచ్చు..!

National Pension Scheme: ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి మిగిలి ఉండే ఏకైక ఆదాయ వనరు పెన్షన్.

Update: 2025-01-27 06:39 GMT
Invest RS 20000 Monthly in National Pension Scheme to Get 1 Lakh Monthly Pension After Retirement

National Pension Scheme: ఈ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు రూ.1 లక్ష పెన్షన్ తీసుకోవచ్చు..!

  • whatsapp icon

National Pension Scheme: ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి మిగిలి ఉండే ఏకైక ఆదాయ వనరు పెన్షన్. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా లేదా ప్రైవేట్ కంపెనీలో పనిచేసినా పెన్షన్ మొత్తం మీ జీతం, పెన్షన్ ఫండ్‌లో జమ చేసిన మొత్తంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి 60 సంవత్సరాల వయస్సు తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా తగినంత డబ్బును నిధిలో జమ చేయాలి. ప్రభుత్వం పలు రకాల పెన్షన్ పథకాలను నిర్వహిస్తుంది. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఉద్యోగి పదవీ విరమణ తర్వాత మంచి మొత్తాన్ని పొందవచ్చు. ప్రభుత్వం నిర్వహిస్తున్న అటువంటి పథకం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. దీనిలో నెలకు రూ. 20 వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా పదవీ విరమణ తర్వాత రూ. లక్ష పెన్షన్ పొందవచ్చు. ఈ పథకం పేరు జాతీయ పెన్షన్ పథకం(National Pension Scheme).

నేషనల్ పెన్షన్ స్కీం

ఈ పథకాన్ని ప్రభుత్వం 2004 సంవత్సరంలో ప్రారంభించింది. గతంలో ప్రైవేట్ రంగ ఉద్యోగులను ఇందులో చేర్చలేదు. కానీ తరువాత 2009 లో ప్రభుత్వం ఈ పథకం కింద ప్రైవేట్ ఉద్యోగులను కూడా చేర్చింది. దేశంలో ఎక్కడైనా ఈ పథకాన్ని అమలు చేయవచ్చు. ఇందులో ఎంత డబ్బు జమ చేసినా, పదవీ విరమణ తర్వాత దానిలో 60 శాతం విత్ డ్రా చేసుకునే సదుపాయం ఉంది. పొదుపు నుండి మిగిలిన డబ్బును యాన్యుటీ ప్లాన్ కొనడానికి ఉపయోగిస్తారు. దీని ద్వారా ఉద్యోగి రిటైల్ అయిన తర్వాత నెలవారీ పెన్షన్ లభిస్తుంది.

లక్ష పెన్షన్ ఎలా పొందాలి ?

జాతీయ పెన్షన్ పథకం అనేది ప్రభుత్వం నిర్వహించే పదవీ విరమణ పథకం. దీని కింద పెట్టుబడి పెట్టడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. పెన్షన్ ఎలా వస్తుందనే విషయానికొస్తే, దీని కోసం 40 సంవత్సరాల వయస్సు నుండి NPSలో ప్రతి నెలా రూ. 20,000 జమ చేయడం మొదలు పెట్టాలి. కావాలనుకుంటే ప్రతి సంవత్సరం పెట్టుబడిని 10 శాతం పెంచవచ్చు. 40 నుండి 60 సంవత్సరాల వయస్సు వరకు ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడితే పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా లక్ష రూపాయల పెన్షన్ వస్తుంది.

Tags:    

Similar News