ఆన్ లైన్ లావాదేవీలు చేస్తున్నారా?: ఈ జాగ్రత్తలు తప్పనిసరి
స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్ లైన్ లావాదేవీలు మరింత పెరిగాయి. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆన్ లైన్ లావాదేవీలు చేస్తున్నారా?: ఈ జాగ్రత్తలు తప్పనిసరి
స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్ లైన్ లావాదేవీలు మరింత పెరిగాయి. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆన్ లైన్ లావాదేవీల సమయంలో విశ్వసనీయత లేని వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఎన్ పీ సీ ఐ సూచిస్తోంది.లావాదేవీలు జరిపే వెబ్ సైట్ కు సంబంధించిన సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. డిస్కౌంట్లు, తక్కువ ధరల ఆఫర్ల పేరుతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు.
ఇలాంటి వెబ్ సైట్ల జోలికి పోతే జేబులకు చిల్లుపడం ఖాయం. ఆన్ లైన్ లావాదేవీల సమయంలో వ్యక్తిగత సమాచారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరానికి మించి వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దు. షాపింగ్ మాల్స్ సహా ఇతర ప్రాంతాల్లో ఒపెన్ వైఫెను ఉపయోగించవద్దని ఎన్ పీ సీఐ కోరింది. ఇలాంటి వై ఫైలు ఉపయోగిస్తే మీ ఫోన్లను హ్యాకర్లు దాడి చేయవచ్చు.
డిజిటల్ పేమెంట్స్ కు సంబంధించిన పాస్ వర్డ్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. కామన్ గా ఉండేలా పాస్ వర్డ్స్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నెట్ బ్యాంకింగ్ ఉపయోగించే సమయంలో కూడా ఇలానే చేయాలి. మీ పాస్ వర్డ్ ను ఎవరికి చెప్పవద్దు.ఈ కామర్స్ సైట్లు పండుగల సమయంలో ఆఫర్లను ప్రకటిస్తాయి. ఇలాంటి సమయాల్లో సైబర్ నేరగాళ్లు ఇలాంటి ఆఫర్లతో వినియోగదారులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తారు. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.