దేశీయంగా ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 190 రూపాయల వరకూ తగ్గి 39,600 రూపాయలుగా ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 190 రూపాయల వరకూ తగ్గి 36,290 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కేజీ కి 500 రూపాయలు పెరగడంతో 48,500 రూపాయలకు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది.
ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయల వరకూ తగ్గి 38,250రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర 200 రూపాయల వరకూ తగ్గి 37,050 రూపాయల వద్ద నిలిచింది. కేజే వెండి ధర ఇక్కడ కూడా 500 రూపాయలు పెరిగి 48,500 రూపాయలకు చేరింది.