Free Life Insurance: ఈపీఎఫ్ సభ్యులకు ఉచితంగా జీవిత భీమా.. ఈ వివరాలు మీకు తెలుసా?
Free Life Insurance: ఈపీఎఫ్ సభ్యులకు ఉచిత భీమా అందించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఇది వర్తించనుంది.

Free Life Insurance: ఈపీఎఫ్ సభ్యులకు ఉచితంగా జీవిత భీమా: ఈ వివరాలు మీకు తెలుసా?
Free Life Insurance: ఈపీఎఫ్ సభ్యులకు ఉచిత భీమా అందించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఇది వర్తించనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ సభ్యులుగా చేరితే ఉచిత జీవిత భీమా అందనుంది. ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఈపీఎఫ్ సభ్యులకు జీవిత భీమా అందుతుంది. 1976లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ 1952 నిబంధనల కింద నమోదైన అన్ని సంస్థలకు ఈ పథకాన్ని వర్తించనుంది. నెలకు 15 వేల బేసిక్ పే ఉన్న ఉద్యోగులు ఈ స్కీమ్ లో డిఫాల్ట్ గా సభ్యులుగా మారుతారు. ఉద్యోగి నెలలవారీ వేతనంలో 0.5 శాతం ఈడీఎల్ఐ పథకానికి విరాళంగా యాజమాన్యం అందిస్తోంది. అయితే ఉద్యోగి గరిష్ట వేతనం 15 వేల వరకు ఉన్నవారికి మాత్రమే ఇది వర్తించనుంది. ఈ పథకానికి ఉద్యోగి నుంచి ఎలాంటి కంట్రిబ్యూషన్ అవసరం లేదు.
ఈపీఎఫ్ కింద జీవిత భీమా పొందిన సభ్యుడు మరణిస్తే నామినికి భీమా డబ్బులు అందిస్తారు. ఏడాది వరకు ఉద్యోగి తీసుకున్న నెలలవారీ సగటు జీతం కంటే 30 రెట్లు ఉంటుంది. ఈ పథకం కింద 2.5 లక్షలు కనిష్టం, ఎక్కువలో ఎక్కువ రూ. 7 లక్షలు అందిస్తారు. అయితే ఉద్యోగుల వేతనాలపై ఆధారపడి ఉంటుంది.
మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఇందుకు అవసరమైన డాక్యుమెంట్లను క్లైయిమ్ ఫారంతో పాటు ఈపీఎఫ్ కు అందించాలి. ఈ డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత నామిని బ్యాంకు ఖాతాలో డబ్బులు అందజేస్తారు.