Canara Bank: డిపాజిట్లపై వడ్డీరేట్లుపెంచిన కెనరా బ్యాంక్‌.. వీరికి మరింత లాభం..!

Canara Bank: ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన కెనరా బ్యాంకు వడ్డీ రేట్లలో మార్పులు చేసింది.

Update: 2023-08-16 10:30 GMT

Canara Bank: డిపాజిట్లపై వడ్డీరేట్లుపెంచిన కెనరాబ్యాంక్‌.. వీరికి మరింత లాభం..!

Canara Bank: ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన కెనరా బ్యాంకు వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లని పెంచింది. ఈ పెరిగిన వడ్డీరేట్లు ఆగష్టు 12, 2023 నుంచి అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం బ్యాంకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై సాధారణ ఖాతాదారులకు 4 శాతం నుంచి 7.25 శాతం వరకు సీనియర్ సిటిజన్లకు 4.5 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. అయితే పెరిగిన వడ్డీరేట్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లు

* 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై 4.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 46 రోజుల నుంచి 90 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై5.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 91 రోజుల నుంచి 179 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై 5.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 180 రోజుల నుంచి 269 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై 6.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 270 రోజుల నుంచి ఒక ఏడాదిలోపు కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* ఏడాది కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై 6.90 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 444 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* అలాగే 80 సంవత్సరాల వయస్సు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు సాధారణ ఖాతాదారులతో పోల్చితే 60 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీ రేటును, అలాగే సీనియర్ సిటిజన్లతో పోల్చితే 10 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీ రేటును అందిస్తుంది. 

Tags:    

Similar News