Bank Holidays: ఫిబ్రవరిలో సగం రోజులు బ్యాంకులు బంద్.. పనులుంటే ఇప్పుడే చక్కబెట్టుకోండి

Bank Holidays: ఫిబ్రవరిలో సగం రోజులు బ్యాంకులు బంద్.. పనులుంటే ఇప్పుడే చక్కబెట్టుకోండి
Bank Holidays: కొత్త సంవత్సరం మొదటి నెల ముగిసిన రెండో నెల ఫిబ్రవరి మొదలు కానుంది. ఫిబ్రవరిలో దాదాపు సగం రోజులు అంటే 14రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ మేరకు బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను ఆర్బిఐ విడుదల చేసింది. ప్రస్తుతం ఎక్కువగా బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేకుండానే అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారు వినియోగదారులు.
అయితే ఇతర ఆర్థిక సంబంధిత పనుల కోసం తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బ్యాంకులకు వెళ్లే ముందు ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయి..ఎప్పుడు సెలవులు ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఫిబ్రవరిలో బ్యాంకుల సెలవులు ఇవే..
ఫిబ్రవరి 2 : ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత.
ఫిబ్రవరి 3 : సరస్వతి పూజ..అగర్తలలో బ్యాంకులకు హాలీడే.
ఫిబ్రవరి 8 : రెండో శనివారం సందర్భంగా సెలవు.
ఫిబ్రవరి 9 : ఆదివారం సందర్భంగా హాలీడే.
ఫిబ్రవరి 11 : థై పోసమ్ సందర్భంగా చెన్నైలో మూసివేత.
ఫిబ్రవరి 12 : శ్రీరవిదాస్ జయంతి నేపథ్యంలో షిమ్లాలో సెలవు.
ఫిబ్రవరి 15 : లుయ్ గై ని పండుగ సందర్భంగా ఇంఫాల్‌లో హాలీడే.
ఫిబ్రవరి 16 : ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకుల బంద్
ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ముంబయి, నాగ్‌పూర్‌లో సెలవు.
ఫిబ్రవరి 20 : స్టేట్హుడ్ డే సందర్భంగా అరుణాచల్‌ప్రదేశ్ ఈటానగర్‌లో బ్యాంకులకు సెలవు.
ఫిబ్రవరి 22 : నాలుగో శనివారం కావడంతో బ్యాంక్‌లకు సెలవు.
ఫిబ్రవరి 23 : ఆదివారం బ్యాంకుల మూసివేత.
ఫిబ్రవరి 26 : మహాశివరాత్రి సందర్భంగా ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో సెలవులు.
ఫిబ్రవరి 28 : లోసర్ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లోని బ్యాంక్‌లకు సెలకు హాలీడే.