HDFC Customers: హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్.. ఇప్పుడు వీటిపై మరింత చెల్లించాల్సిందే..!
HDFC Customers: హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు ఇది బ్యాడ్‌న్యూస్ అని చెప్పాలి. ఎంసిఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది.
HDFC Customers: హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు ఇది బ్యాడ్‌న్యూస్ అని చెప్పాలి. ఎంసిఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ మార్పు అక్టోబర్ 7 నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త అప్‌డేట్ తర్వాత HDFC బ్యాంక్ ఓవర్‌నైట్ MCLR 8.60%గా ఉంది. ఇది కాకుండా ఒక నెలకు MCLR 8.65%, మూడు నెలలు, ఆరు నెలలకు 8.85%, 9.10% ఉంటుంది. చాలా మంది కస్టమర్ల రుణాలతో సంబంధం ఉన్న ఒక సంవత్సరం MCLR ఇప్పుడు 9.20% అవుతుంది. అదేవిధంగా రెండేళ్ల MCLR 9.20%, మూడేళ్ల MCLR 9.25% ఉంటుంది.
1.) ఒక నెలకు---8.65%
2.) 3 నెలలకు----8.85%
3.) ఆరు నెలలకు----9.10%
4.) ఒక సంవత్సరానికి ----9.20%
5.) రెండు సంవత్సరాలకు----9.20%
6.) మూడు సంవత్సరాలకు----9.25%
రెపో రేటు 6.50 శాతం వద్ద
MCLR అనేది నిర్దిష్ట రుణం కోసం బ్యాంకులు వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటు. MCLR రుణ రేట్లకు బెంచ్‌మార్క్ లేదా తక్కువ పరిమితిగా పనిచేస్తుంది. అక్టోబర్ 1, 2019 నుంచి SBIతో సహా అన్ని బ్యాంకులు RBI రెపో రేటు ప్రకారం వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వాలి. RBI ఇటీవల ముగిసిన మూడు రోజుల MPC సందర్భంగా వరుసగా నాలుగోసారి రెపో రేటును 6.50 శాతం వద్ద ఉంచాలని నిర్ణయించింది.
మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎంపిక చేసిన కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. కొత్త అప్‌డేట్ ప్రకారం బ్యాంకులు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సాధారణ కస్టమర్‌లకు 3% నుంచి 7.20% వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు కాలపరిమితిని బట్టి 3.5% నుంచి 7.75% వరకు మారుతూ ఉంటుంది.