రిటైర్‌మెంట్ ఫండ్‌కి ప్లాన్‌ చేస్తున్నారా.. ఈ మోసాలకి గురికావొద్దు జాగ్రత్త..!

Retirement Frauds: మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే కొంత కాలం తర్వాత రిటైర్మెంట్‌ అవుతున్నట్లయితే ఈ వార్త ఉపయోగకరంగా ఉంటుంది.

Update: 2023-02-05 03:30 GMT

రిటైర్‌మెంట్ ఫండ్‌కి ప్లాన్‌ చేస్తున్నారా.. ఈ మోసాలకి గురికావొద్దు జాగ్రత్త..!

Retirement Frauds: మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే కొంత కాలం తర్వాత రిటైర్మెంట్‌ అవుతున్నట్లయితే ఈ వార్త ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన అనేక కేసులు తెరపైకి వస్తున్నాయి. ఈ పరిస్థితిలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సైబర్ మోసగాళ్లు కష్టపడి సంపాదించిన డబ్బును సులువుగా దోచేస్తున్నారు. వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మోసగాళ్లు ప్రధాన మంత్రి యోజన, ఈపీఎఫ్‌ఓ కార్యాలయాల్లో అనేక మంది వ్యక్తుల డేటా, ఫోన్ నంబర్‌లను సేకరిస్తున్నారు. ఫోన్ చేసి వివిధ రకాల పెట్టుబడి ఆశలని చూపిస్తూ పిల్లల భవిష్యత్తును మెరుగుపరుస్తామని చెబుతూ ఖాతా వివరాలను తీసుకుంటున్నారు. తర్వాత బ్యాంకు ఖాతా నుంచి లక్షల రూపాయలు దోచేస్తున్నారు. అందుకే ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ఇలాంటి మోసాలని నివారించవచ్చు.

బ్యాంకులు లేదా ఏజెంట్ల నుంచి ఏ ఉత్పత్తిని కొనుగోలు చేయవద్దు. ఎందుకంటే వారు తమ లాభాన్ని చూసుకుంటారు. ఆదాయ వనరులు లేనప్పుడు'గ్యారంటీడ్ రిటర్న్స్' వంటి బీమా పథకాలను కొనుగోలు చేయవద్దు. మీకు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌కి సంబంధించిన ఏదైనా మెసేజ్ వస్తే లేదా అకౌంట్ కేవైసీ పూర్తి కాలేదని, లేదా సిస్టమ్‌లో పవర్ కట్, వైరస్ వంటి మెసేజ్‌లు వస్తే వాటికి అస్సలు స్పందించవద్దు.

మీరు ఈ మెస్సేజ్‌కి ప్రత్యుత్తరం ఇస్తే మీ డేటా మోసగాళ్లకు వెళుతుంది. వారు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తారు. ఇది జరిగితే తెలివిగల వ్యక్తి సహాయం తీసుకోవడం సముచితం. మీకు బ్యాంక్ నుంచి లేదా ప్రధాన మంత్రి యోజన నుంచి లేదా ఎక్కడైనా ఆకర్షణీయమైన ఆఫర్ కోసం కాల్ వస్తే అతను మిమ్మల్ని డెబిట్ కార్డ్ నంబర్, CVV లేదా OTP, పాస్‌వర్డ్ వంటి ప్రైవేట్ వివరాలను అడిగితే అస్సలు చెప్పవద్దు. ఏ విధమైన సమాచారాన్ని ఇతరులతో షేర్‌ చేసుకోవద్దు.

ఈ రోజుల్లో సైబర్ మోసాలు మెయిల్ ఐడిపై అటాచ్‌మెంట్‌ను పంపి దాన్ని ఓపెన్‌ చేయమని అభ్యర్థిస్తున్నాయి. ఏదైనా లింక్ లేదా అటాచ్‌మెంట్‌ని తెరవమని అడిగితే లేదా సమాచారాన్ని డౌన్‌లోడ్ చేయమని అడిగినట్లయితే సిస్టమ్‌ను హ్యాక్ చేయడానికి ప్రైవేట్ సమాచారాన్ని దొంగిలించడానికి ఇది ఒక మార్గమని గమనించండి. ఇలా అస్సలు చేయవద్దు. ఇటువంటి మెయిల్‌లు, మెస్సేజ్‌లని స్పామ్‌గా నివేదించండి.

Tags:    

Similar News