జనవరిలో 3 శాతం పెరగనున్న బెంజ్ కార్ల ధరలు

Mercedes-Benz India to raise prices by up to 3% from Jan 1, 2025: CEO Santosh Iyer
x

 జనవరిలో 3 శాతం పెరగనున్న బెంజ్ కార్ల ధరలు

Highlights

లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడేస్ బెంజ్ ఇండియా తన కార్ల ధరలను 3 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ ధరల పెంపు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు...

లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడేస్ బెంజ్ ఇండియా తన కార్ల ధరలను 3 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ ధరల పెంపు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. కార్ల ధరలు కనిష్టంగా రూ.2లక్షల నుంచి గరిష్టంగా రూ.9 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదల వంటివి వ్యాపార కార్యకలాపాలపై భారీ ఒత్తిడి ఎదురవుతోందని తెలిపింది. దీంతో గత మూడు త్రైమాసికాలలో కంపెనీ నిర్వహణ ఖర్చులు పెరిగాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ధరల పెంచాలని నిర్ణయించినట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ అన్నారు.

అయితే డిసెంబర్ 31లోపు బుకింగ్ చేసుకునే వాహనాలకు ఈ ధర పెంపు వర్తించదని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం మెర్సిడేస్ బెంజ్ దేశీయంగా వివిధ మోడళ్లను విక్రయిస్తోంది. వీటిలో రూ.45 లక్షల ప్రారంభ ధర ఉన్న ఏ క్లాస్ నుంచి రూ.3.6 కోట్ల జీ63 ఎస్‌యూవీ వరకు అనేక రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories