‘కృష్ణ లీల’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన హీరో నిఖిల్
Krishna Leela: Krishna Leela: యంగ్ ట్యాలెంటెడ్ దేవన్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ లవ్ స్టొరీ రూపోందుతోంది.

Krishna Leela: దేవన్, ధన్య బాలకృష్ణన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం కృష్ణ లీల. దేవన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరెకెక్కిస్తున్నారు. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్‌పై జ్యోత్స్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు- అనిల్ కిరణ్ కుమార్ అందించారు. ఈ సినిమాకి 'కృష్ణ లీల' అనే టైటిల్ ఖరారు చేశారు. 'తిరిగొచ్చిన కాలం'అనేది ట్యాగ్ లైన్. ఈ టైటిల్ లాంఛ్ ఈవెంట్‌కు హీరో నిఖిల్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. 'దేవన్ చాలా పాషన్ ఉన్న యాక్టర్, డైరెక్టర్. హ్యాపీడేస్‌కి ముందు నేను కూడా ఒక మంచి అవకాశం కోసం తపన పడేవాడిని. దేవుడి దయవల్ల నాకు హ్యాపీ డేస్ దొరికింది. అదే దేవుడి దయవల్ల తనకి కృష్ణ లీలతో పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మోషన్ పోస్టరు నాకు చాలా నచ్చింది. ఇందులో దేవ్ డిఫరెంట్ సేడ్స్ నాకు చాలా నచ్చాయి. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ ఈ టీం ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
హీరో దేవన్ మాట్లాడుతూ. 'అందరికీ నమస్కారం.. ముందుగా మా అమ్మానాన్నలకి కృతజ్ఞతలు. నాకు సినిమా జీవితాన్ని ఇచ్చిన మా నిర్మాతలు జ్యోత్స్న, అనిల్ గారికి ధన్యవాదాలు. వారికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. చోటా కె నాయుడు ఇష్టమైన కెమెరామెన్. ఆయనతో కలవడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఫైనల్‌గా ఆయనని కలిసి ఈ సినిమా కథ చెప్పా. ఈ జర్నీ ఒక మిరాకిల్‌లా మొదలైంది. గంగాధర్ శాస్త్రికి ఈ సినిమా కథ చెప్పాను. ఆయన నాకు విలువైన సూచనలు ఇచ్చారు. 18 పేజేస్ నుంచి అఖిల్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన చూసిన తర్వాత మరింత ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆయన నాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఈవెంట్ కొచ్చి మాకు సపోర్ట్ చేసిన నిఖిల్ అన్నకి థాంక్యూ సో మచ్' అని అన్నారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, పృధ్వి (పెళ్లి), రవి కాలే , తులసి, 7ఆర్ట్స్ సరయు, ఆనంద్ భరత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.