తెలుగు రాష్ట్రాలకు భారీ వర‌్ష సూచన
రాయలసీమ, తెలంగాణకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 5 వరకు బలంగా రుతుపవనాలు వీయడంతో, మరో రెండు రోజుపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నేడు రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు నుంచీ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
రాయలసీమ, తెలంగాణకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కారణంతో అక్టోబర్ 5 వరకు బలంగా రుతుపవనాలు వీయడంతో, మరో మూడు రోజుపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నేడు రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు నుంచీ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. రాయలసీమతో ఉరుములతో కూడిన భారీ వర్షాలుతో పాటు దక్షిణ కోస్తాలో పలు చోట్ల తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇటీవలె కురిసిన వర్షాలతో హైదారాబాద్ నీట మునిగిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రాజెక్టులన్ని నిండు కుండలను తలపిస్తున్నాయి. జురాల ప్రాజెక్టు నుంచి 11 గెట్లు ఎత్తి 1.28లక్షల కూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మంచిర్యాలలోని వెల్లంపల్లిలో భారీగా వరద నీరు చెరుతుంది.