Allu Arjun: అరెస్టుపై చంద్రబాబు ఫోన్
అల్లు అర్జున్ కు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేశారు. ఫోన్ లో అల్లు అర్జున్ ను పరామర్శించారు.
అల్లు అర్జున్ (allu arjun)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు (Chandrababu naidu) శనివారం ఫోన్ చేశారు. అరెస్టు గురించి ఆరా తీశారు. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట గురించి కూడా ఆయన ఆరా తీసినట్టు సమాచారం. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ లో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించారు.
ఈ కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు డిసెంబర్ 13న అరెస్ట్ చేశారు.నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.ఈ బెయిల్ ఆర్డర్ సకాలంలో జైలు అధికారులకు అందకపోవడంతో డిసెంబర్ 13 రాత్రి ఆయన చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. డిసెంబర్ 14 ఉదయం ఏడు గంటలకు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
అల్లు అర్జున్ కు జూ. ఎన్టీఆర్ ఫోన్
అల్లు అర్జున్ కు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేశారు. ఫోన్ లో అల్లు అర్జున్ ను పరామర్శించారు. ముంబైలో సినిమా షూటింగ్ లో ఉన్నందున తాను రాలేకపోయినట్టుగా ఎన్టీఆర్ చెప్పారు.హైదరాబాద్ వచ్చిన తర్వాత కలుస్తానన్నారు. మరో నటులు ప్రబాస్ కూడా అల్లు అర్జున్ కు ఫోన్ చేసి పరామర్శించారు.