ఏ రోజును అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంగా జరుపుతరో మీకు తెలుసా? ఈ భూమి మనిషి ఒక్కని సొత్తు మాత్రమే కాదు, ఇక్కడ వున్నా ఎన్నో జీవరాసుల్లో ఒక జీవి మనిషి, అందుకే మనిషి మనుగడకి మిగిలిన జీవుల అవసరం ఎంతో వుంది, కాబట్టి అంతర్జాతీయ జీవవైవిధ్య అవసరం గుర్తించి జీవవైవిధ్య దినోత్సవంగా May, 22 ను జరుపుతారు. జీవవైవిద్యం భూమిపై వివిధ రకాల వైవిధ్యతను సూచిస్తుంది. జీవవైవిధ్యం సాధారణంగా జన్యు, జాతి మరియు జీవావరణవ్యవస్థ స్థాయిలో వైవిధ్యాన్ని కొలుస్తుంది. భూమండల జీవవైవిధ్యం సాధారణంగా భూమధ్యరేఖ సమీపంలో ఉంటుంది, ఇది వెచ్చని వాతావరణం మరియు అధిక ప్రాధమిక ఉత్పాదకత ఫలితంగా ఉంది. శ్రీ.కో.