రామాయణ మహాకావ్యంలో ఎన్ని కాండములు మరియు శ్లోకాలు వున్నాయో మీకు తెలుసా! రామాయణ మహాకావ్యములో ఏడు కాండములు (భాగములు) గా విభజింప బడింది. మొత్తము 24వేల శ్లోకములు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు). కాండము అనగా చెరకుగడ కణుపు అని అర్ధము. రామాయణ కథనము చెరకు వలె మధురమైనది గనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు.