ఆడవాళ్లకే సొంతమైన ప్రదేశమది!
కెన్యాలోని ఉమోజా అనే గ్రామంలో మగాళ్లకు చోటులేదు. కేవలం ఆడవాళ్లకే సొంతమైన ప్రదేశమది.
కెన్యాలోని ఉమోజా అనే గ్రామంలో మగాళ్లకు చోటులేదు. కేవలం ఆడవాళ్లకే సొంతమైన ప్రదేశమది. రెబెకా లొలొసోలీ అనే ఆవిడ పాతికేళ్ల క్రితం ఈ గ్రామాన్ని స్థాపించింది. సాంబురు తెగలకు చెందిన స్త్రీలు, ఆడపిల్లల్ని గృహహింస, పురుషాధిక్యత నుంచి కాపాడేందుకే ఇది. స్త్రీలను హింసించే ఆచారాలు, పద్ధతులు ఎక్కువగా ఉన్న పురుషాధిక్య తెగ సాంబురు. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాల్ని, అవమానాల్ని ఎదుర్కున్న రెబెకా మిగతా ఆడవారి రక్షణ కోసం దీన్ని నెలకొల్పారు. అనాథలు, పీడితులు, విధవలు, బలవంతపు పెళ్లిళ్లకు బలైన మహిళలకు ఇక్కడ ఆశ్రయమిస్తారు. శ్రీ.కో