రోజు ఒక ఆపిల్ తింటే...డాక్టర్ అవసరం లేదు అంటారు. కాని ఆపిల్ పండును ముక్కలుగా కోసిన కాసేపటికి వాటి రంగు బ్రౌన్‌గా ఎందుకు మారుతుందో మీకు తెలుసా! ఆపిల్ పండును ముక్కలుగా కోసిన కాసేపటికి వాటి రంగు బ్రౌన్‌గా ఎందుకు మారుతుంది అంటే...ఆపిల్ పండులో 'టానిక్ యాసిడ్' అనే రసాయనిక ద్రవం ఉంటుంది. మనం ఆపిల్ పండును ముక్కలుగా కోసినప్పుడు ఆ భాగాలకు గాలి తగులుతుంది. అప్పుడు వాటిలోని టానిక్ యాసిడ్‌కి, గాలిలోని ఆక్సిజన్‌కి మధ్య రసాయనిక చర్య జరుగుతుంది. ఫలితంగా పాలీఫినాల్స్ అనే పదార్థం ఏర్పడుతుందట. ఆక్సీకరణం అనే ఈ చర్య వల్ల ఏర్పడే పాలీఫినాల్స్ బ్రౌన్ రంగులో ఉంటాయి. అందువల్లే ఆపిల్ ముక్కలు ఆ రంగులోకి మారతాయి. అలా రంగు మారకుండా ఉండాలంటే కోసిన భాగంపై నిమ్మరసం చల్లాలి. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ ఆపిల్ పండులో ఉండే టానిక్ యాసిడ్‌పై పొరలాగా ఏర్పడి ఆక్సీకరణం జరగకుండా అడ్డుకుంటుంది.శ్రీ.కో.