Car Brakes Fail: రన్నింగ్‌లో కారు బ్రేకులు ఫెయిల్‌ అయితే ఏం చేస్తారు.. ఈ టిప్స్‌ పాటించండి..!

Car Brakes Fail:ఈ రోజుల్లో కారు డ్రైవింగ్‌ సులువుగా చేస్తున్నారు కానీ సడెన్‌గా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే డీల్‌చేయలేకపోతున్నారు. దీనివల్ల ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు.

Update: 2024-04-01 10:30 GMT

Car Brakes Fail: రన్నింగ్‌లో కారు బ్రేకులు ఫెయిల్‌ అయితే ఏం చేస్తారు.. ఈ టిప్స్‌ పాటించండి..!

Car Brakes Fail: ఈ రోజుల్లో కారు డ్రైవింగ్‌ సులువుగా చేస్తున్నారు కానీ సడెన్‌గా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే డీల్‌చేయలేకపోతున్నారు. దీనివల్ల ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. కారు డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు అత్యవసర ఇబ్బంది ఎదురైతే దాని నుంచి ఎలా బయటపడాలో చాలా మందికి అవగాహన లేదు. చాలాసార్లు మీరు బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ప్రమాదాలు జరిగిన వార్తలు వింటూనే ఉంటారు. మీరు డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తారు.. మీ ఫ్యామిలీని ఎలా కాపాడుతారు. ఈ రోజు కారు బ్రేకులు ఫెయిల్‌ అయితే ఏం చేయాలో తెలుసుకుందాం.

నిజానికి కారు మెయింటనెన్స్‌ సరిగ్గా లేకపోవడం వల్ల, వాహనం సమయానికి సర్వీస్ చేయకపోతే, ఆయిలింగ్, క్రీజింగ్ లేకపోవడం వల్ల బ్రేకులు దెబ్బతింటాయి. కొన్నిసార్లు ఓవర్ స్పీడ్ లేదా ఆకస్మిక షార్ప్ బ్రేకింగ్ కారణంగా వాహనం బ్రేకులు పాడవుతాయి. మీరు బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు కొన్ని రకాల చిట్కాలు పాటించడం వల్ల వాహనం 8 నుంచి 9 సెకన్లలో ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఆగిపోతుంది. ఈ ట్రిక్‌ను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి. సాధారణంగా ఉపయోగిస్తే వాహనం ఫిట్‌నెస్ దెబ్బతింటుంది.

స్పీడ్‌లో ఉన్నప్పుడు బ్రేకులు ఫెయిల్ అయితే ఏం చేయాలి?

మీరు కారులో అధిక వేగంతో ప్రయాణిస్తుంటే కారు బ్రేక్‌లు ఫెయిల్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. బ్రేకులు లేకుండా కారును ఆపడానికి ముందుగా కారు ఎక్స్‌లెటర్‌పై కాలు తీయాలి. తర్వాత క్లచ్‌ని నొక్కి నెమ్మదిగా గేర్‌ డౌన్‌ చేయాలి. వాహనాన్ని మొదటి గేర్‌కి తీసుకు రావాలి. ఇలా చేయడం వల్ల వాహనం వేగం తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా మరొక పద్ధతి కూడా ఉంది. దీనిని పాటించి సులువుగా వాహనాన్ని ఆపవచ్చు.

హ్యాండ్ బ్రేక్‌తో కారును ఆపవచ్చు

వేగంగా వెళ్తున్న వాహనం హ్యాండ్ బ్రేక్ వేస్తే వాహనం బోల్తా పడుతుందని అనుకుంటారు కానీ ఈ సలహా అప్లై చేస్తే అలా కాకుండా ఉంటుంది. కారు అధిక వేగంతో ఉన్నప్పుడు హ్యాండ్ బ్రేక్‌ను అప్లై చేసేటప్పుడు ముందుగా గేర్‌ను డౌన్‌ చేయాలి. దీనివల్ల వాహనం వేగం తగ్గుతుంది. సాధారణంగా హ్యాండ్ బ్రేక్‌ని జెర్కిగా ఉపయోగిస్తారు అయితే వాహనం వేగంతో ఉన్నప్పుడు, ముందుగా మీరు సగం హ్యాండ్ బ్రేక్‌ను పైకి లేపాలి. తర్వాత వెంటనే పూర్తి హ్యాండ్ బ్రేక్‌ను పైకి లేపాలి. దీంతో మీ కారు ఆగిపోతుంది.

Tags:    

Similar News