Tata Nano EV: తగ్గేదేలే.. టాటా నానో రీఎంట్రీ.. క్రేజీ లుక్‌తో ఎలక్ట్రిక్ అవతార్‌గా వస్తోంది..!
Tata Nano EV: టాటా మోటార్స్ మరోసారి మార్కెట్లోకి చౌకైన మధ్యతరగతి కారును విడుదల చేయబోతోంది. ఈ కారు పెట్రోల్ లేదా డీజిల్‌తో కాదు, విద్యుత్తుతో నడుస్తుంది.

Tata Nano EV: టాటా మోటార్స్ మరోసారి మార్కెట్లోకి చౌకైన మధ్యతరగతి కారును విడుదల చేయబోతోంది. ఈ కారు పెట్రోల్ లేదా డీజిల్‌తో కాదు, విద్యుత్తుతో నడుస్తుంది. ఇది ఖర్చులను కూడా తగ్గిస్తుంది. మనం మాట్లాడుతున్న కారు "Tata Nano EV". ఇది చాలా సరసమైన ధరకు వస్తోంది, 25-30 వేల జీతం ఉన్న వ్యక్తులు కూడా దానిని సులభంగా కొనుగోలు చేయచ్చు. టాటా తన పాత నానోకు కొత్త అవతార్‌లో మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈ కారు రెండు కొత్త వేరియంట్స్‌లో వచ్చే అవకాశం ఉంది. మొదటిది పెట్రోల్ ప్లస్ సీఎన్‌జీ, రెండవది పూర్తిగా ఎలక్ట్రిక్‌గా ఉంటుంది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. దాని లుక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
నివేదికల ప్రకారం.. టాటా నానో ఈవీ ఒక కాంపాక్ట్ కారు. దీని పొడవు 3,164మిమీ, వెడల్పు- 1,750మిమీ, వీల్ బేస్- 2,230మిమీ. గ్రౌండ్ క్లియరెన్స్- 180మిమీగా ఉంటుంది. ఈ కారులో 4 సీట్లు ఉంటాయి, అంటే ఈ కారులో నలుగురు వ్యక్తులు సులభంగా ప్రయాణించగలరు. టాటా నానో ఎలక్ట్రిక్ వేరియంట్ 17 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కారును ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
నానో దాని కొత్త వేరియంట్‌లో చాలా భిన్నంగా, ప్రత్యేకంగా ఉండబోతోంది. అలాగే శక్తివంతమైనది కూడా. ఈ కారు గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్ల వరకు ఉంటుందని, ఈ కారు కేవలం 10 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని చెబుతున్నారు. ఈ కారు భద్రత పరంగా కూడా చాలా బలంగా ఉంటుందని చెబుతున్నారు. కంపెనీ దీనిలో అనేక భద్రతా ఫీచర్లను అందించబోతోంది. ఈ కారులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉంటాయి.
టాటా ఈ సరసమైన ఎలక్ట్రిక్ కారు ధర రూ. 3.5 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు ఉంటుంది. భారతదేశంలో ఈ రేంజ్‌లో ఎలక్ట్రిక్ కారు లేదు. అంటే, ఈ కారు చాలా చౌకగా ఉంటుంది, రూ. 25-30 వేల జీతం ఉన్నవారు కూడా దీన్ని సులభంగా కొనుగోలు చేయచ్చు. దేశంలో పెరుగుతున్న ఈవీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని టాటా తక్కువ ధరలో నానో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.