Electric Bike: అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 151కి.మీ.. నెలకు రూ.100ఖర్చు చేస్తే చాలు..!

Electric Bike: ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైకుల వాడకం పెరిగిపోయింది. మార్కెట్లోకి రోజుకో కొత్త బైక్ ఎంటర్ అవుతుంది.

Update: 2024-11-08 06:04 GMT

Electric Bike: అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 151కి.మీ.. నెలకు రూ.100ఖర్చు చేస్తే చాలు..!

Electric Bike: ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైకుల వాడకం పెరిగిపోయింది. మార్కెట్లోకి రోజుకో కొత్త బైక్ ఎంటర్ అవుతుంది. ప్రతి బైకుకు అత్యాధునిక ఫీచర్లను జత చేస్తూ కస్టమర్లను ఆకర్షించే విధంగా బైకులను తయారుచేస్తున్నాయి కంపెనీలు. మీరు కూడా స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలన్న ప్లానులో ఉన్నట్లు అయితే ప్రస్తుతం మార్కెట్లో సంచలనంగా నిలిచిన ఈ బైక్ ఎంచుకోవచ్చు. మిగతా బైకులతో పోలిస్తే ఇది ఎక్కువ మైలేజీ ఇస్తుంది. దాంతో పాటు అదిరిపోయే ఫీచర్స్ కూడా ఉన్నాయి.

పూర్తి వివరాలు తెలుసుకుని ఏ బైక్ కొనాలో నిర్ణయం తీసుకోండి.. అదే బైక్ అంటే PURE EV కంపెనీ తయారుచేసినటు వంటి EcoDryft ఎలక్ట్రిక్ బైక్. దీని బ్యాటరీని ఒక్కసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే.. ఏకంగా 151కిలోమీటర్ల మేర ప్రయాణం చేయవచ్చు. అందువల్ల ఇది ఈ సెగ్మెంట్‌లో అత్యంత చవకైన, ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్ గా చెబుతున్నారు. రోజువారీ వాడకానికి ఈ బైక్ చాలా బాగుంటుంది.

ఈ బైక్ ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే దీనికి 3.0కిలో వాట్స్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని బయటకు తియ్యవచ్చు. అలాగే 3 kW (కిలోవాట్) BLDC హబ్ మోటర్ ను ఈ బైకుకు అమర్చారు. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 75 కిలోమీటర్లు వెళ్తుంది. బ్యాటరీని 4-5 గంటల్లో ఫుల్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బైక్ నాలుగు బ్యూటీఫుల్ కలర్స్‌లో లభిస్తోంది. అవి బ్లాక్, గ్రే, రెడ్, బ్లూ. ఈ బైక్ మొత్తం బరువు 101 కేజీలు. పెద్ద బైకులతో పోలిస్తే తక్కువే. దీనికి ముందువైపు డిస్క్ బ్రేక్.. వెనకవైపు డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. డిస్ప్లే చూస్తే.. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. ఇందులో బ్యాటరీ స్పీడ్, ఓడోమీటర్, ఇతర సమాచారం ఉంటుంది.

ఈ బైక్‌కి ఎకో, డ్రైవ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఇచ్చింది కంపెనీ. మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి యూఎస్ బీ ఛార్జింగ్ పోర్టు ఇచ్చారు. సీటు కింద చిన్న చిన్న వస్తువులు ఉంచుకోవడానికి స్టోరేజ్ కూడా అందుబాటులో ఉంది. ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,15,000గా నిర్ణయించారు.. ఇది రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటుంది.

ఈ బైక్‌తో 100 కిలోమీటర్లు వెళ్తే.. సుమారుగా రూ.18.50 ఖర్చవుతుంది. ఆ లెక్కన ప్రతి రోజూ 20 కిలోమీటర్ల చొప్పున వెళ్తే.. 5 రోజులకు 100 కిలోమీటర్లు అవుతుంది. అయ్యే ఖర్చు రూ.18.50 కాబట్టి.. నెలకు ఈ లెక్కన అయ్యే ఖర్చు రూ.111 దాకా అవుతుంది. రెండు వీకాఫ్‌లు తీసేస్తే.. రూ.100కంటే కూడా తక్కువే ఖర్చు అవుతుంది.

Tags:    

Similar News