Maruti Fronx Hybrid Launch: మైలేజ్ రారాజు.. మారుతి నుంచి హైబ్రిడ్ కార్.. బైక్ కన్నా ఇదే బెటర్..!

Maruti Fronx Hybrid Launch: మారుతి సుజుకి హైబ్రిడ్ టెక్నాలజీతో తన ప్రసిద్ధ SUV ఫ్రాంక్స్‌ను విడుదల చేయనుంది. 37 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

Update: 2024-08-26 08:50 GMT

Maruti Fronx Hybrid Launch

Maruti Fronx Hybrid: సొంత ఇల్లు, అందులో ఓ కారు ఉండాలనేది ప్రతి వ్యక్తి కోరుకుంటారు. వారి కలను సాకారం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. తీరా కార్ కొనే క్రమంలో మైలేజ్, ధర గురించి ఆలోచిస్తారు. ఆటో మార్కెట్‌లో మారుతి సుజికి కార్లు అధిక మైలేజ్‌‌తో తక్కువ ధరకు లభిస్తాయి. కస్టమర్లు కూడా వీటినే ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. అందుకే మారుతి అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయి. కంపెనీ ఇప్పుడు హైబ్రిడ్ కార్లపై దృష్టి సారిస్తోంది. మైక్రో హైబ్రిడ్ నుంచి స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ వరకు మారుతీ కార్లలో చూస్తున్నాం. ప్రస్తుతం మారుతి సుజుకి హైబ్రిడ్ టెక్నాలజీతో తన ప్రసిద్ధ SUV ఫ్రాంక్స్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. ఇది వచ్చే ఏడాది ప్రారంభించబడుతుందని మీకు తెలియజేద్దాం. కొత్త ఫ్రాంటెక్స్ దేశంలోనే అత్యధిక మైలేజీని ఇచ్చే కారుగా కూడా అవతరించనుందని చెబుతున్నారు.

Maruti Fronx 
మారుతి సుజుకి కొత్త ఫ్రాంక్స్‌లో Z12E సిరీస్1.2 లీటర్ హైబ్రిడ్ ఇంజన్‌ను 3 సిలిండర్‌లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ హైబ్రిడ్ + ఫ్యూయల్‌పై 37 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ ఇంజన్ కొత్త స్విఫ్ట్‌‌లో కూడా ఉంటుంది. కానీ ఇందులో హైబ్రిడ్ టెక్నాలజీ లేదు. స్విఫ్ట్‌లో హైబ్రిడ్ టెక్నాలజీని కూడా త్వరలో రావచ్చు.

Maruti Fronx CNG
మీరు పెట్రోల్, CNG ఎంపికలతో మారుతి సుజుకి కొత్త ఫ్రాంక్స్ కొనుగోలు చేయవచ్చు. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.51 లక్షల నుండి రూ.12.87 లక్షల వరకు ఉంది. అయితే ఈ కారు హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చినప్పుడు దీని ధర కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మారుతి ఫ్రాంక్స్ ఫీర్లను తెలసుకుందాం.

Maruti Fronx Engine
ఫ్రాంక్స్ 1.2L K-సిరీస్ అడ్వాన్స్‌డ్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT పెట్రోల్ ఇంజన్, 1.0L పెట్రోల్ ఇంజన్‌తో సహా రెండు ఇంజన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఇది కాకుండా స్టార్ట్ స్టాప్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ వెహికల్ CNGలో కూడా అందుబాటులో ఉంది. CNG మోడ్‌లో 28.51 కిమీ మైలేజీ లభిస్తుంది. FRONX ప్రారంభించి ఇప్పటికి 10 నెలలకు పైగా అయ్యింది. ఇప్పటి వరకు 1.37 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.

Maruti Fronx Best Features
బాలెనో తర్వాత ఫ్రాంక్స్ చాలా ఎక్కువ స్పేస్ కలిగి ఉంది. ఇందులో 5 మంది కూర్చునే స్థలం ఉంది. ముందు పొడవు 3995 మిమీ, వెడల్పు 1765 మిమీ, ఎత్తు 1550 మిమీ. ఇందులో 308 లీటర్ల బూట్ స్పేస్‌ ఉంటుంది. దీని కారణంగా మీకు చాలా స్థలం లభిస్తుంది. వెనుక సీటు మడతపెట్టినట్లయితే మీకు చాలా మంచి స్థలం లభిస్తుంది. ఈ కారు క్యాబిన్ కూడా ప్రీమియంగా చాలా మంచి లేటెస్ట్ ఫీచర్లతో వస్తుంది. ఈ కారులో హెడ్‌అప్ డిస్‌ప్లే, టర్న్ బై టర్న్ నావిగేషన్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, 9 అంగుళాల HD స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్డు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఉన్నాయి. భద్రత కోసం కారులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 6 ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇటీవల మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ను ఎటువంటి టాక్స్ చెల్లించకుండా కొనుగోలు చేయవచ్చు. దీని ప్రయోజనం సైనికులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కారు CSD (క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్) వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుంది. క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్‌పై భారతీయ సైనికులు చాలా తక్కువ GST చెల్లించాల్సి ఉంటుంది. వారు 28 శాతం పన్ను బదులు 14 శాతం మాత్రమే చెల్లించాలి. Fronx 5 వేరియంట్‌లు మాత్రమే CSDలో అందుబాటులో ఉంటాయి. ఈ కారు నార్మల్ పెట్రోల్ మాన్యువల్, నార్మల్ పెట్రోల్ ఆటోమేటిక్, టర్బో పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ధర గురించి మాట్లాడితే ఫ్రాంటెక్స్ సిగ్మా వేరియంట్ ధర రూ. 7,51,500 అయితే CSDలో దీని ధర రూ. 6,51665.

Tags:    

Similar News