LML Star Electric Scooter: రేంజ్‌లో రారాజు.. సింగిల్ ఛార్జ్‌తో 150 కిమీ మైలేజ్.. కిర్రాక్ డిజైన్, అడ్వాన్స్ ఫీచర్స్..!
LML Star Electric Scooter: లోహియా మెషినరీ లిమిటెడ్ (LML) తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 150 కిమీ రేంజ్ అందిస్తుంది.
LML Star Electric Scooter: లోహియా మెషినరీ లిమిటెడ్ (LML) తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్ అధికారిక డిజైన్‌తో సస్పెన్స్‌ను పరిచయం చేసింది. రాబోయే స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ డిజైన్‌పై పేటెంట్ పొందింది. డుకాటీ, ఫెరారీ, యమహా, కవాసకి ద్విచక్ర వాహనాలతో అనుబంధం ఉన్న డిజైనర్లు దీని డిజైన్‌ను రూపొందించారని తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు ఎల్‌ఎమ్‌ఎల్ గతంలో ప్రకటించింది. ఇది పండుగ సీజన్లో రోడ్లపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎల్‌ఎంఎల్ ఈ డిజైన్ పేటెంట్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు లేటెస్ట్ లుక్ అందించిందని చూపిస్తుంది. ఇది డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ వైట్ బాడీ కలర్, LED DRL, ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు, రెడ్ యాక్సెంట్‌లను పొందుతుంది. ఇందులో గైడ్ మీ హోమ్ ల్యాంప్‌లతో కూడిన ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, ఫ్రంట్ ఆప్రాన్ వెనుక కస్టమైజ్‌డ్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, డిజిటల్ స్క్రీన్ ఉంటాయి.
ఇది 2kWh సామర్థ్యం కలిగిన 2 రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లతో రావచ్చు. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 150 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీని మోటార్ 7bhp పవర్ రిలీజ్ చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. అదే సమయంలో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 1 లక్ష వరకు ఉండవచ్చు.
ఈ స్కూటర్‌లోని ప్రత్యేకత ఏమిటంటే.. ముందువైపు డిజిటల్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. యాప్ సహాయంతో ఈ స్క్రీన్‌పై ఏదైనా మెసేజెస్, స్టేటస్ సెట్ చేయవచ్చు. మీరు మీ పేరును ఇక్కడ డిస్‌ప్లే చేయవచ్చు. ఈ స్క్రీన్ ప్యానెల్‌తో మీరు విండ్‌స్క్రీన్ కింద LED హెడ్‌ల్యాంప్‌లతో పాటు డ్యూయల్ LED DRLలను కూడా చూడవచ్చు.
స్టార్ మిడ్-మ్యాక్సీ స్కూటర్ లాంటిదని, ఇది అనేక ఫీచర్లతో లడ్ అయిందని కంపెనీ తెలిపింది. రైడర్ భద్రత కోసం LMLstar ఎలక్ట్రిక్ స్కూటర్‌లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, ABS వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉంటాయి. ఇండియన్ మార్కెట్లో ఓలా, టీవీఎస్, ఏథర్, బజాజ్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.