KTM Duke 390: బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన కెటిఎమ్ డ్యూక్ ధర..!

KTM Duke 390: దేశంలో అడ్వెంచర్ బైక్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. పెరిగిన సోషల్ మీడియా ట్రెండ్ కారణంగా చాలా మంది యువత ఇటువంటి వాటిని కొని ట్రావెలింగ్ చేస్తూ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు.

Update: 2025-02-14 12:45 GMT
KTM Duke 390: బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన కెటిఎమ్ డ్యూక్ ధర..!

KTM Duke 390: బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన కెటిఎమ్ డ్యూక్ ధర..!

  • whatsapp icon

KTM Duke 390: దేశంలో అడ్వెంచర్ బైక్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. పెరిగిన సోషల్ మీడియా ట్రెండ్ కారణంగా చాలా మంది యువత ఇటువంటి వాటిని కొని ట్రావెలింగ్ చేస్తూ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఉద్యోగుల్లో పని ఒత్తిడి పెరగడంతో.. దాని నుంచి బయటపడానికి వీకెండ్స్‌లో బైక్స్‌పై లాంగ్ డ్రైవ్ చేస్తున్నారు.

అందుకే మార్కెట్లో ఇటువంటి బైక్స్ అమ్మకాలు క్రమంగా పంజుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కెటిఎమ్ ఫ్లాగ్‌షిప్ 390 డ్యూక్‌తో దేశంలోని యువతను ఆకర్షించింది. 390సీసీ బైక్ సెగ్మెంట్లో ఈ మోటార్ సైకిల్ సేల్స్ కూడా దూసుకుపోతున్నాయి. అయితే ఇప్పుడు కెటిఎమ్ ఈ సేల్స్ రెట్టింపు చేసేందుకు డ్యూక్ ధరను రూ. 18,000 తగ్గించింది. బైక్ ఫీచర్లు, కొత్త ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

కంపెనీ దేశంలో ఫ్లాగ్‌షిప్ స్ట్రీట్‌ఫైటర్ డ్యూక్ 390ని రూ. 3.13 లక్షలకు లాంచ్ చేసింది. బైక్ ఇప్పుడు రూ. 2.95 లక్షలకు కొనడానికి అందుబాటులో ఉంది. అంటే రూ. 18,000 తగ్గింపు ప్రకటించింది. ఈ బైక్‌లో 399cc LC4C ఇంజన్‌ ఉంది. ఈ ఇంజన్ 46పిఎస్ పవర్, 39ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్యూక్ 390 క్లాస్ లీడింగ్ ఎలక్ట్రానిక్స్, ఫీచర్లతో మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

కెటిఎమ్ డ్యూక్ 390లో మల్టీ రైడ్ మోడ్‌లు ఉన్నాయి. లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సాటిలేని రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి. 'ది కార్నర్ రాకెట్'గా పిలిచే KTM 390 డ్యూక్‌లో ఖచ్చితమైన బ్రేకింగ్, కార్నరింగ్ కంట్రోల్ కోసం సూపర్‌మోటో ఏబీఎస్ సిస్టమ్ ఉపయోగించారు.

ప్రస్తుతం మార్కెట్లో 390సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను శాసిస్తున్న KTM 390 గత కొన్నేళ్లుగా ఇతర కంపెనీ బైక్‌లకు గట్టీపోటినిస్తూ నిద్రలేకుండా చేస్తుంది. ఇప్పుడు ధరను మరింత తగ్గించి ఈ పోటీని భారీగా పెంచేసింది. కొత్త ధరల పెంపు మోటార్‌సైకిళ్ల విక్రయాలను పెంచుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.

Tags:    

Similar News