Kia Syros SUV: భద్రతలో టాటాకు సవాల్.. 8.99 లక్షల కియా సైరస్ ఎస్‌యూవీకి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్..!
Kia Syros SUV: కియా మోటార్స్ 'సైరస్' ఒక ఫేమస్ ఎస్‌యూవీగా అవతరించింది. కస్టమర్లకు అత్యంత ఇష్టమైనది ఎంపికగా నిలిచింది. ఈ మార్చిలో 5,425 యూనిట్ల సైరస్ ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి.

Kia Syros SUV: భద్రతలో టాటాకు సవాల్.. 8.99 లక్షల కియా సైరస్ ఎస్‌యూవీకి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్..!
Kia Syros SUV: కియా మోటార్స్ 'సైరస్' ఒక ఫేమస్ ఎస్‌యూవీగా అవతరించింది. కస్టమర్లకు అత్యంత ఇష్టమైనది ఎంపికగా నిలిచింది. ఈ మార్చిలో 5,425 యూనిట్ల సైరస్ ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. ఇది సరసమైన ధరకు లభిస్తుంది. దేశ వాహన భద్రతా పరీక్షా సంస్థ భారత్ NCAP, కొత్త కియా సైరస్‌ను అత్యంత సురక్షితమైన కారుగా రేట్ చేసింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Kia Syros SUV Safety Rating
భారత్ NCAP సేఫ్టీ టెస్ట్‌లో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో సరికొత్త కియా సైరోస్ ఎస్‌యూవీ 32కి 30.21 స్కోరు సాధించింది. ఇది పిల్లల రక్షణ విభాగంలో 49కి 44.42 స్కోర్ చేసింది. దీని ద్వారా 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను సాధించడంలో విజయం సాధించింది. అదనంగా, కియా సైరస్ కారు ముందు భాగాన్ని ఢీకొట్టి పరీక్షించారు. అందులో16 పాయింట్లకు 14.21 పాయింట్లు సాధించగలిగింది. అదేవిధంగా, కారు రెండు వైపులా కూడా ఒక అవరోధాన్ని ఢీకొట్టింది. ఆ పరీక్షలో 16 కి 16 మార్కులు వచ్చాయి.
Kia Syros SUV Features
కియా సైరస్ ఎస్‌యూవీలో ప్రయాణీకులను రక్షించడానికి డజన్ల కొద్దీ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ఆటో హోల్డ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.
కియా సైరస్‌లో 5 సీట్లు ఉన్నాయి. ప్రయాణీకులు సులభంగా ప్రయాణం చేయచ్చు. ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి దీనిలో 465 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ డిస్‌ప్లేలో డ్యూయల్ స్క్రీన్ సెటప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి.
Kia Syros SUV Price
కియా సైరస్ ధర రూ. 8.99 లక్షలు, రూ. 17.80 లక్షలు ఎక్స్-షోరూమ్.ఇది వివిధ రకాల వేరియంట్లలో లభిస్తుంది. స్పార్కింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే, ఇంపీరియల్ బ్లూ, ఇంటెన్స్ రెడ్. ప్యూటర్ ఆలివ్ వంటి మల్టీ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. సైరస్‌లో 1-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. ఇది లీటర్‌పై 17.65 నుండి 20.75 kmpl మైలేజీని ఇస్తుంది.