White Colour Car: భారతీయులకు తెల్ల కార్లపైనే మోజు ఎందుకు? అసలు విషయం తెలిస్తే.. వాహ్ అనాల్సిందే..!

White Colour Car: కారు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు తెలుపు రంగును ఎందుకు ఇష్టపడతారు? మార్కెట్‌లో ఎరుపు, నలుపు, నీలం, పసుపు, నారింజ, బంగారం వంటి అనేక ఆకర్షణీయమైన రంగులు ఉన్నప్పటికీ కస్టమర్లు మాత్రం 'తెలుపు' కార్లను మాత్రమే ఎందుకు అడుగుతారు?

Update: 2023-07-22 13:30 GMT

White Colour Car: భారతీయులకు తెల్ల కార్లపైనే మోజు ఎందుకు? అసలు విషయం తెలిస్తే.. వాహ్ అనాల్సిందే..!

White Colour Car: కారు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు తెలుపు రంగును ఎందుకు ఇష్టపడతారు? మార్కెట్‌లో ఎరుపు, నలుపు, నీలం, పసుపు, నారింజ, బంగారం వంటి అనేక ఆకర్షణీయమైన రంగులు ఉన్నప్పటికీ కస్టమర్లు మాత్రం 'తెలుపు' కార్లను మాత్రమే ఎందుకు అడుగుతారు? భారతదేశంలో ఈ కారునే ఎందుకు ఎక్కువమంది వాడుతున్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలుసా? తెలియపోతే.. ఇప్పుడు తెలుసుకుందాం. వీటిపై పరిశోధకులు పరిశోధన చేసి ఒక నివేదికను సమర్పించారు. అందులో వివరాలు తెలుసుకుంటే మాత్రం కచ్చితంగా ఆశ్చర్యపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యేది తెలుపు రంగే..

భారతదేశంలో అమ్ముడవుతున్న ప్రతి రెండు కార్లలో ఒకటి తెల్లగా ఉంటుందని పవార్ సర్వేలో తేలింది. ఈ సర్వే ప్రకారం, భారతీయులు ఆడంబరమైన వాటికి బదులుగా లేత రంగులను ఇష్టపడతారంట. దేశంలో అమ్ముడైన కార్లలో నాలుగింట ఒక వంతు సిలర్వ లేదా బూడిద రంగులో ఉన్నాయి. ఉత్తర భారత ప్రజలు దక్షిణ భారతదేశం కంటే తెలుపు రంగును ఎక్కువగా ఇష్టపడతారు. దక్షిణ భారతీయుల్లో 34% మంది తెల్లటి కార్లను ఉపయోగిస్తుండగా, ఉత్తర భారతీయుల్లో 66% మంది తెల్లటి కార్లను ఉపయోగిస్తున్నారు. 2013లో కార్ల విక్రయాలలో 11% రంగు కార్లు అయితే 4% బ్లాక్ కార్లు. అయితే, యూత్ మాత్రం ప్రస్తుతం ముదురు రంగుల కార్లను ఇష్టపడుతున్నారు.

తెల్లటి కారును విక్రయించడానికి అనేక కారణాలు ఉన్నాయి. భారతదేశం దాదాపు 9 నెలల పాటు వేసవి కాలం ఉండే నగరం. కాబట్టి సహజంగా వేసవిలో కారును రోజంతా ఎండలో పార్క్ చేసినప్పుడు అది వేడిగా ఉంటుంది. కానీ, ఇతర కార్లతో పోలిస్తే తెల్లవి తక్కువ వేడిగా ఉంటాయి. ఎందుకంటే సూర్య కిరణాలు పరావర్తనం చెందుతాయి. అందుకే ఇతర కార్ల కంటే తెల్లటి కార్లపై వేడి ప్రభావం తక్కువగా ఉంటుంది. అందువల్ల, తెలుపు కార్లకు డిమాండ్ ఉంది.

తెలుపు రంగు కార్లు ఎక్కువగా అమ్ముడవడానికి అనేక కారణాలు ఉన్నాయి. రాత్రిపూట ప్రయాణించడానికి తెల్లటి రంగు కార్లు సురక్షితమైనవిగా పరిగణిస్తుంటారు. ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే రాత్రిపూట కూడా తెల్లటి రంగు కార్లు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే, వాటికి పెద్దగా నిర్వహణ అవసరం లేదు. ధూళి, దుమ్ము దానిపై సులభంగా కనిపిస్తాయి. ఇది శుభ్రం చేయడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. మరోవైపు, తెల్లటి కారుపై గీతలు సులభంగా కనిపిస్తాయి. వెంటనే దాన్ని సరిచేయడానికి మీరు దానిని గ్యారేజీకి తీసుకెళ్లవచ్చు.

Tags:    

Similar News