Mohammed Siraj: మరో లగ్జరీ కార్ కొన్న సిరాజ్
Mohammed Siraj: భారత్ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Mohammed Siraj: భారత్ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇటీవల తన డ్రీమ్ కార్ రేంజ్ రోవర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కుటుంబం కోసం ఈ కారు కొన్నట్లుగా తెలిపాడు. సిరాజ్ తన రేంజ్ రోవర్‌ను 'సాంటోరిని బ్లాక్' కలర్ వేరియంట్ కొనుగోలు చేశాడు. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ రెండు ఇంజన్ ఆప్షన్స్‌లో వస్తుంది. ఆటోబయోగ్రఫీ LWB (లాంగ్ వీల్ బేస్)లో 3.0 లీటర్ పెట్రోల్ ఇంజన్, HSE LWBలో 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మీ కలలకు హద్దులు ఉండకూడదని, కష్టపడి పనిచేసి మరిన్ని విజయాలు సాధించేందుకు అవి మీకు స్ఫూర్తినిస్తాయని సిరాజ్ తన పోస్ట్‌లో రాశాడు. నిరంతరం శ్రమించడమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. నా కుటుంబం కోసం @landroverpridemotors నుండి ఈ డ్రీమ్ కారును కొనుగోలు చేయడానికి నాకు శక్తిని ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు.
Range Rover Features
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఒక లగ్జరీ SUV. దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇందులో ఇచ్చిన ఫీచర్లను చూస్తుంటే ఈ ధర సమర్థనీయంగా కనిపిస్తోంది. ఈ SUV ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో పాటు వివిధ టెర్రైన్ మోడ్‌లను కలిగి ఉంది. ఇది సస్పెన్షన్, థొరెటల్ రెస్పాన్స్, డిఫరెన్షియల్‌ను రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ చేస్తుంది.13.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నాలుగు-జోన్ క్లైమేట్ కంట్రోల్, సాఫ్ట్ డోర్ క్లోజ్, కీలెస్ ఎంట్రీ, క్లియర్‌సైట్ ఇంటీరియర్ రియర్-వ్యూ మిర్రర్, ఒక గృహ ప్లగ్ సాకెట్ మరియు పవర్డ్ జెస్చర్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లతో వస్తుంది.
అలానే 24-వే హీటెడ్ అండ్ కూల్డ్, హాట్ స్టోన్ మసాజ్ ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కంఫర్ట్ రియర్ సీట్లు, మెరిడియన్ సిగ్నేచర్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది ట్రైలర్ స్టెబిలిటీ అసిస్ట్, ఎలక్ట్రికల్ టోయింగ్ ప్రిపరేషన్, అడాప్టివ్ ఆఫ్-రోడ్ క్రూయిజ్ కంట్రోల్, లో ట్రాక్షన్ లాంచ్, ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్ వంటి ఫీచర్లను కూడా ఉన్నాయి.
రేంజ్ రోవర్‌లోని 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ 346bhp శక్తిని మరియు 700nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, 3.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 393bhp శక్తిని మరియు 550nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ కారు 0 నుండి 100 కి.మీ వేగాన్ని కేవలం 6.3 సెకన్లలో అందుకుంటుంది. అయితే పెట్రోల్ ఇంజన్ ఉన్న కారు దానిని 5.9 సెకన్లలో పూర్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 8-స్పీడ్ ట్రాన్స్మిషన్ కలిగి ఉంటాయి.